మా ఇద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్‌ – శర్వానంద్

0
382

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్‌ హీరో శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా టాలెంటెడ్‌ డైరెక్టర్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై టేస్ట్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరి ‘పడి పడి లేచె మనసు’ . ఈ చిత్రం డిసెంబర్‌ 21న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా యంగ్‌ హీరో శర్వానంద్‌తో ‘ఇండస్ట్రీ హిట్‌’ ఇంటర్వ్యూ.

‘పడి పడి లేచె మనసు’ టైటిల్‌ వినగానే మీ రియాక్షన్‌?
– ఈ సినిమా కథలో భాగంగా హీరో ప్రేమలో హీరోయిన్‌ పడే సన్నివేశాలు చాలా ఉంటాయి. ‘పడి పడి లేచె మనసు’ నేటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యేలా ఉండటంతో టైటిల్‌ కన్‌ఫర్మ్‌ చేయడం జరిగింది.

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రానికి, ఈ చిత్రానికి మధ్య ఉన్న డిఫరెన్స్‌?
– ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కి కూడా బాగా కనెక్ట్‌ అవుతుంది. సబ్జెక్ట్‌ పరంగా రెండు చిత్రాలు దేనికదే డిఫరెంట్‌గా ఉంటాయి.

కలకత్తా లో ఎక్కువగా షూటింగ్‌ జరపడానికి రీజనేమైనా ఉందా?
– అవునండీ. యాక్చ్యువల్‌గా కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘చూడాలని ఉంది’, ‘ఖుషి’, ‘లక్ష్మీ’ ఇలా ఏ సినిమా తీసుకున్నా సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యాయి. కలకత్తా అనగానే హౌరా బ్రిడ్జ్‌, మహంకాళి టెంపుల్‌ పరిసరాల్లో ఎక్కువగా షూట్‌ చేశారు. అయితే మా సినిమాలో ఇప్పటివరకూ కలకత్తాలో ఎవరూ చూపించని కొత్త అందాలను ప్రాపర్‌గా చూపించాలని, ఈ సినిమా కథని కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో షూట్‌ చేయడం జరిగింది.

నిర్మాత సుధాకర్‌గారి ప్రొడక్షన్‌ వేల్యూస్‌?
– సుధాకర్‌గారు చాలా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. కథకి ఏమేం కావాలో అవి ఖచ్చితంగా సమకూర్చారు. ఇలాంటి టేస్ట్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ ఉండటం తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. సినిమా ఇంత బాగా వచ్చిందంటే ఆయన అన్‌కాంప్రమైజ్‌డ్‌ ప్రొడక్షన్‌ వేల్యూసే.

డైరెక్టర్‌ హను వర్కింగ్‌ స్టైల్‌ గురించి?
– హను టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌ పర్సన్‌. తన ఆలోచనా విధానం నెక్స్‌ట్‌ లెవెల్‌లో ఉంటుంది. తను నాకు గత 15 సంవత్సరాలుగా తెలుసు. టెక్నికల్‌గా తనకి రావాల్సిన గుర్తింపు ఈ చిత్రం ఫుల్‌ఫిల్‌ చేస్తుంది.

సాయిపల్లవితో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌?
– ఈ సినిమాలో కథా పరంగా సూర్య, వైశాలి క్యారెక్టర్స్‌కి పెర్‌ఫార్మెన్స్‌ పరంగా మంచి స్కోప్‌ ఉంది. సన్నివేశాల్లో ఒకరినొకరు డామినేట్‌ చేసుకుంటే ఆ ఫీల్‌ పండదు. కానీ సినిమాలో సన్నివేశాలు నేచురల్‌గా వచ్చాయంటే దానికి కారణం సాయిపల్లవే. తను మంచి పెర్‌ఫార్మెర్‌. మా ఇద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాకి ఓ హైలైట్‌.

సూర్య క్యారెక్టర్‌ కోసం ఏమైనా ప్రిపేర్‌ అయ్యారా?
– ఏమీ లేదండీ. హను కథ నేరేట్‌ చేసేటప్పుడే ఈ క్యారెక్టర్‌ చాలా బ్రైట్‌గా ఉంటుంది అన్నారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ని చాలా డిఫరెంట్‌గా, పాజిటివ్‌గా డిజైన్‌ చేశారు. హను ఏం చెప్తే అదే చేశాను.

ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఫొటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు?
– జెకెగారు చాలా బ్రిలియంట్‌. ఆయనతో కలిసి వర్క్‌ చేయడం చాలా గర్వంగా ఉంది. ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్స్‌కి మంచి గుర్తింపు వస్తోంది. ఈ సినిమాతో జెకెకి కూడా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. కలకత్తాలోని కొన్ని లొకేషన్స్‌ని బ్యూటిఫుల్‌గా చూపించారు.

ట్రైలర్‌ చూస్తుంటే మెమొరీ లాస్‌కి సంబంధించిన అంశాలు ఉన్నట్లున్నాయి?
– ఈ సినిమాలో సిట్చ్యుయేషన్‌ పరంగా మెమొరీ లాస్‌కి సంబంధించిన అంశం ఉంటుంది. అది థియేటర్లో చూస్తేనే ఆడియన్స్‌ ఆ ఫీల్‌ ఎంజాయ్‌ చేస్తారు.

ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో బన్ని మీ గురించి పాజిటివ్‌గా రెస్పాండ్‌ అవడం ఎలా అన్పించింది?
– బన్ని, నాకు చిన్నప్పటి నుండి మంచి అనుబంధం ఉంది. తను అందరి విషయంలో పాజిటివ్‌గా ఉంటారు. పిలవగానే ఫంక్షన్‌కి వచ్చి మాకు సపోర్ట్‌ చేసినందుకు బన్నికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

విశాల్‌ చంద్ర మ్యూజిక్‌ గురించి?
– విశాల్‌ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్‌నిచ్చారు. నేను హనుతో ఒకటే చెప్పాను. సినిమాలో ప్రతి సాంగ్‌ ది బెస్ట్‌గా ఉండాలి అని చెప్పాను. విశాల్‌ సినిమాలో ప్రతి సాంగ్‌ సూపర్బ్‌ మ్యూజిక్‌నిచ్చారు.

లవ్‌స్టోరీస్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు?
– నేను ఒక జోనర్‌లో సినిమా చేసిన తర్వాత మళ్ళీ అదే జోనర్‌లో సినిమా చేయడం నచ్చదు. అందుకే డిఫరెంట్‌ జోనర్స్‌లో చేస్తుంటాను. నా గత చిత్రం కామెడీ ఎక్కువ ఉంది. ఈ చిత్రంలో ఫీల్‌తో కూడిన మంచి లవ్‌స్టోరి ఉంది. నా రాబోయే సినిమా యాక్షన్‌ జోనర్‌లో ఉంటుంది.

సుధీర్‌ వర్మతో మూవీ ఎంతవరకు వచ్చింది?
– ఫిఫ్టీ పర్సెంట్‌ షూటింగ్‌ అయ్యింది. అది 1980లో జరిగే గ్యాంగ్‌స్టర్‌కి సంబంధించిన యాక్షన్‌ మూవీ. సినిమా కాన్సెప్ట్‌ చాలా కొత్తగా, హాలీవుడ్ దర్శకుడు గైరిచి స్టైల్ లో ఉంటుంది.

’96’ సినిమాని రీమేక్‌ చేస్తున్నారా?
– సినిమా చూశాను. ఫెంటాస్టిక్‌గా ఉంది. ఆ చిత్రానికి సంబంధించిన వర్క్‌ జరుగుతోంది. వివరాలు త్వరలో చెప్తా.

http://industryhit.com/t/2018/12/sharwanand-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here