బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ ఫస్ట్ లుక్ విడుదల..!!

0
94

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘కవచం’ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.. ఈ పోస్టర్ లో ఖాకీ డ్రెస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తుండగా తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడం విశేషం..థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు.. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తున్న ఈ సినిమాని నవీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు.. డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్..

సాంకేతిక నిపుణులు :
డైరెక్టర్ : శ్రీనివాస్
నిర్మాత : నవీన్ సొంటినేని
బ్యానర్ : వంశధార క్రియేషన్స్
సహా నిర్మాత: చాగంటి సంతయ్య
మ్యూజిక్ : ఎస్.ఎస్.థమన్
ఛాయాగ్రహణం : చోటా కే నాయుడు
ఆర్ట్ డైరెక్టర్ : చిన్నా
PRO : వంశీ – శేఖర్

Click Here For ‘Kavacham’ HD Pics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here