‘శైలజారెడ్డి అల్లుడు’ లో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనింగ్ గా వుండే క్యారెక్టర్లో నటించాను – యువసామ్రాట్ నాగచైతన్య

0
400

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా అనుఇమ్మాన్యూల్ హీరోయిన్గా యస్.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హిట్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో యువ నిర్మాత నాగ వంశీ, పిడివి ప్రసాద్ నిర్మించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ప్రేమమ్ వంటి సూపర్ హిట్ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగచైతన్య నటించిన రెండో చిత్రం ఏది. ఈ చిత్రం సెప్టెంబర్ 13న వినాయకచవితి సందర్భంగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు యువసామ్రాట్ నాగచైతన్యతో సూపర్ హిట్ ఇంటర్వ్యూ విశేషాలు.

ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

– చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది..వెరీ ప్యూర్ ఫెలో. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాల్లో కంటే ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనింగ్ గా వుండే క్యారెక్టర్లో ఫస్ట్ టైం నటించాను. ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దెగ్గర అవుతాను. ఎలాంటి ఇగో లేకుండా తనమీద తానే జోక్స్ వేసుకుంటూ సరదాగా కూల్ గా ఉంటాడు..ఏ సమస్య వచ్చిన అంతే కూల్ గా డీల్ చేస్తాడు. ఇంతటి మంచి క్యారెక్టర్ ని డిసైన్ చేసిన మారుతికి నా థాంక్స్.

శైలజారెడ్డి అల్లుడు అసలు కథేంటి?

గతంలో అత్త .. అల్లుళ్ళు కాన్సెప్ట్స్ తో చాలా సినిమాలు వచ్చాయి. శైలజారెడ్డి అల్లుడు టైటిల్ ఎనౌన్స్ చేయగానే . అత్త అల్లుడు మీద పగతీర్చుకోవడం, అల్లుడు అత్త మీద రివెంజ్ తీర్చుకోవడం అని . సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చాయి. అలాంటి సినిమా కాదు ఇది. చాలా డిఫరెంట్ సినిమా. మనిషికి ఇగో ఎక్కువైతే ఎన్ని ప్రాబ్లెమ్స్ వస్తాయో కామిడీ గా చూపించాం. అదే ఇగో లేకపోతె ప్రతి ఒక్కరితో ఎంత సరదాగా ఉండొచ్చో ఈ చిత్రంలో చూపించారు. అలాగే ఈ చిత్రంలో చిన్న సోషల్ ఎలిమెంట్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఎమోషన్స్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్కి కి బాగా నచ్చుతాయి.

రమ్యకృష్ణ గారితో నటించడం ఎలావుంది?

– వెరీ హ్యాపీ ఆండీ. నాన్నగారు రమ్యకృష్ణగారు చేసిన హలో బ్రదర్ సినిమా నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ ఆ సినిమా 30 సార్లు చూసి వుంటాను. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ గారు నేషనల్ వైజ్ గా స్టార్ అయ్యారు. అలాంటి ఆవిడతో నడిచేటప్పుడు మొదట్లో కొంచెం నెర్వస్ గా ఉండేది. తర్వాత అలవాటు అయిపోయింది. ఈ చిత్రంలో లాస్ట్ 30 నిముషాలు మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ హైలైట్ అవుతాయి.

ఎంటర్ టైన్మెంట్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది?

– సినిమా అంతా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. వెన్నల కిషోర్ కామిక్ రోల్ చేసాడు.ఆయన క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది.రియల్ గా ఇన్స్పైర్ అయి మారుతి రాసారు. నేను కిషోర్ చేసిన కామిడీ ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. అలాగే సెకండాఫ్ లో పృద్వి చేసిన కామిడీ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

మారుతి వర్కింగ్ స్టయిల్ ఎలావుందీ?

ఇది పక్కా మారుతి బ్రాండ్ మూవీ. కాన్ఫిడెంట్ డైరెక్టర్.తనకి ఏంకావాలో క్లియర్ గా తెల్సు. కథ నాకు చెప్పినప్పుడు విపరీతంగా నచ్చింది. నాకు ఏదైతే కథ చెప్పాడో అదే స్క్రీన్ పై తీసాడు. సినిమా చూసాక చాలా హ్యాపీగా వున్నాం. మళ్ళీ మళ్ళీ మారుతి తో వర్క్ చేయాలనీ వుంది.

సితార ఎంటెర్టైన్మెంట్స్లో లో ప్రేమమ్ చేసారు.. మళ్ళీ శైలజారెడ్డి అల్లుడు చేసారు ఎలా ఫీలవుతున్నారు?

వెరీ వెరీ హ్యాపీ. నేను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ప్రేమమ్. ఆచిత్రం పర్సనల్ గా నాకు బాగా కనెక్ట్ అయింది..డెఫినెట్ గా ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. నాగ వంశీ, పిడివి ప్రసాద్ గారు చాలా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. సితార బ్యానేర్ అంతే నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది. నా కేరీర్లో ప్రేమమ్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆ చిత్రం తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా వుంది

సమంత నటించిన యు టర్న్ మూవీ, మీ సినిమా శైలజా రెడ్డి అల్లుడు ఒకేసారి విడుదల అవుతున్నాయి కదా?

– అవునండీ! మేము కావాలని ప్లాన్ చేయలేదు. ఆలా కుదిరాయి అంతే. వినాయక చవితి పండగ కాబట్టి అందరూ పూజలు చేసుకున్నాక సరదాగా మూవీకి వెళ్లాలనుకుంటారు. సో ఆ టైములో వారికీ నచ్చిన సినిమా వాళ్ళు చూస్తారు. మా ఇద్దరి సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను.

‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి సినిమాలను మీ నుంచి ఆశించ వచ్చా ?

టాలీవుడ్ లో ఈ మధ్య కొంచెం వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. హీరోలు కూడా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇక ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాల్ని నేను చూసాను. నాకు బాగా నచ్చాయి. కానీ నేను అలాంటి సినిమాలు అలాంటి తీవ్రమైన పాత్రలు చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు టైం ఉందని అనుకుంటున్నాను.అలాంటి సినిమాలకు నేను సూట్ అవుతాను అనుకుంటే భవిష్యత్తులో మాత్రం అలాంటి సినిమాలు చేస్తాను.

మీ నాన్నగారి లాగే మీరు కూడా ఆ మధ్య ఎక్కువుగా కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించారు. ప్రస్తుతం ఎందుకు కొత్త డైరెక్టర్స్ తో పని చెయ్యట్లేదు ?

నేను మొదటినుంచి న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూన్నాము. మొన్న ‘చి ల సౌ’ని కూడా ఆ ఉద్దేశ్యంతోనే రిలీజ్ చేసాము. కానీ కొత్త దర్శకులతో పనిచెయ్యటం నా వరికి నాకు పెద్దగా వర్కౌట్ కాలేదు.ఆల్రెడీ మూడు సినిమాలు ఎక్స్ పీరియన్స్ వుంది. ప్రస్తుతానికి అయితే కొత్త డైరెక్టర్లతో పని చేయకూడదు అనుకుంటున్నాను.శైలజారెడ్డి అల్లుడు, సవ్య సాచి, హిట్స్ అయ్యాక మళ్ళీ కొత్త డైరెక్టర్స్ తో చేస్తాను.

సవ్య సాచి పోగ్రెస్ గురించి చెప్పండి?

ఒక పాట మినహా షూటింగ్ అంతా పూర్తి అయింది. అక్టోబర్లో బ్యాలెన్స్ సాంగ్ కంప్లీట్ చేసి అదే నెల చివర్లో మూవీ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం.

వెంకీ మావ షూటింగ్ ఎప్పుడు?

అక్టోబర్ నుంచే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. మావయ్యది, నాది ఇద్దరివీ ఈక్వల్ రోల్స్ ఉంటాయి.

అన్నపూర్ణ లో బంగార్రాజు ఎప్పుడు ఉంటుంది?

స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆ సినిమా స్టోరీకి చాలా స్కోప్ వుంది. వెబ్ సీరిస్ యూట్యూబ్ సిరీస్ చేస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నాం. నాన్న, నేను ఒకసారి, అఖిల్, నాన్న ఒకసారి కలిసి చెయ్యాలని వుంది.

కథల ఎంపికలో మీ నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు వుంది?

స్టార్టింగ్ స్టేజ్ లో నాన్న గారు వినేవారు. ఇప్పుడైతే నేనే వింటున్నాను. ప్రతి ఒక్కరూ ఎవరో ఒక్కరిపైనా డిపెండ్ అయి వుంటారు. ఆలా నా వరకు మా నాన్న గారు గుడ్ ప్రెండ్.

శివ నిర్వాణ సినిమా ఎలా ఉంటుంది?

అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అది. స్క్రిప్ట్ చ్చ బాగా వచియింది.నేను సమంత కలిసి ఆ సినిమా చేస్తున్నాం. చాలా ఎక్సయిటింగ్ గా వుంది.అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here