“అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఎక్కువ అందంగా ఉన్నావు నానా! అని నా కొడుకు కాంప్లిమెంట్‌ ఇచ్చాడు” – నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌

0
449

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో రూపొందిన‌ చిత్రం `నా నువ్వే`. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా జూన్ 14న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఇంట‌ర్వ్యూ…

నా నువ్వే అంటున్నారు కదా! ఎవరితో?
– ‘నా నువ్వే’ .. ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. అందుకే మోర్‌ లవ్‌.. మోర్‌ మ్యాజిక్‌ అనే క్యాప్షన్‌ను కూడా పెట్టాం. పూర్తిస్థాయి రొమాంటిక్‌ సినిమా చేయడం నాకు కూడా ఫస్టే. లవ్‌స్టోరీస్‌లో నాకు గీతాంజలి అంటే చాలా ఇష్టం. అలాంటి సినిమాకు పి.సి.శ్రీరామ్‌గారు కెమెరామెన్‌. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన గురించి ఇంకా ఎక్కువగా తెలిసింది. ఆయనతో పనిచేయగలుగుతామా? అనుకునేవాడిని. ఈ సినిమాతో నా కల నిజమైంది.

రొమాంటిక్‌ సినిమాలు, కమర్షియల్‌ సినిమాలకు ఉన్న తేడా ఏంటి?
– ఇప్పటి వరకు నటుడిగా కమర్షియల్‌ సినిమాలే చేస్తూ వచ్చాను. కమర్షియల్‌ సినిమాల్లో నా బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ అన్ని వేగంగా ఉంటాయి. కానీ ప్యూర్‌ రొమాంటిక్‌ మూవీ అయిన ‘నా నువ్వే’ లాంటి సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. జయేంద్రగారి స్కూల్‌ వేరేగా ఉంటుంది. సెటిల్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేయాలి. కళ్లు పెద్దవి చేయకూడదు. చేతులు ఎక్కువగా ఊపకూడదు. ఎక్కువగా డైలాగ్స్‌ చెప్పకూడదు. ఇలాంటి కండిషన్స్‌ ఎక్కువగా ఉంటాయి. డైలాగ్‌ చెప్పడం కంటే ఎలా ఎక్స్‌ప్రెస్‌ చేశామనేదే ముఖ్యం. ఇలాంటి సినిమా చేయడం నాకు కొత్తగానే అనిపించింది. సినిమా ప్రారంభంలో క్యారెక్టర్‌లోకి వెళ్లడానికి సమయం పట్టేది. జయేంద్రగారు, పి.సి.శ్రీరామ్‌గారు వారి టీంతో ఎంతో కేర్‌ తీసుకున్నారు. స్టార్టింగ్‌లో స్పీడుగా సన్నివేశాలు చేశాను. అయితే జయేంద్ర, పి.సిగారు నన్ను స్లో డౌన్‌ అవమని చెప్పారు. రొమాంటిక్‌ సినిమాల్లో మనం దేనితోనైనా రొమాన్స్‌ చేయవచ్చు. కాబట్టి ముందు కెమెరాని చూడు. రొమాన్స్‌ చెయ్‌. నువ్వు ఫీల్‌ కావాలి. మొత్తం శరీరంలో ఆ ఫీల్‌ కనపడాలి అని పి.సిగారు చెప్పారు.

సెటిల్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేయడానికి ఎవరినైనా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారా?
– లేదండి… డైరెక్టర్‌ జయేంద్రగారు, కెమెరామెన్‌ పి.సి.శ్రీరాంగారిని ఫాలో అయ్యాను. ఏ సీన్‌లో ఎంత చేయాలో అంతే.. నా నుండి రాబట్టుకున్నారు.

కెరీర్‌ స్టార్టింగ్‌లో ఇలాంటి సినిమా చేసుంటే బావుండేదనిపించిందా?
– నేను కూడా డైరెక్టర్‌గారిని ఇదే అడిగాను. మీరు నా కెరీర్‌ స్టార్టింగ్‌లో వచ్చుండాల్సింది. సాధారణంగా ఎవరికైనా లవ్‌స్టోరీస్‌ చేయాలనుంటుంది. నాకు కూడా ఉండేది. అయితే ఎవరూ రాలేదు. ఎందుకనో తెలియదు.

మిమ్మల్ని కొత్తగా చూసిన మీ కుటుంబ సభ్యులేమన్నారు?
– అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఎక్కువ అందంగా ఉన్నావు నానా! అని నా కొడుకు కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. అదే గుడ్‌ కాంప్లిమెంట్‌. ఇప్పటి వరకు నా సినిమాల్లో నేను ఎప్పుడూ నా మీసాలు తీసేయలేదు. ఏదో సినిమాలో తీయాల్సి వస్తే.. నా భార్యకు చెప్పాను. ‘ఎందుకండీ.. బావుదేమో’ అని అనడంతో మానేశాను. అయితే ఈ సినిమాలో నా లుక్‌ చూసి చాలా బావుందని అన్నారు.

మీ పాత్ర ఎలా ఉండొచ్చు?
– నా పాత్రలో ప్రధానాంశాలు గురించి చెప్పలేను. ఎందుంటే నాదైనా, తమన్నా క్యారెక్టర్‌ అయినా సినిమాకు డ్రైవింగ్‌ఫోర్స్‌లాంటివి అందుకనే. పి.హెచ్‌.డి చదివిన ఓ కుర్రాడు.. కాస్త ఇగో ఉంటుంది. కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. ఇలాంటి లక్షణాలున్న కుర్రాడి కథే ఇది.

త‌మ‌న్నాతో నటించ‌డం ఎలా అనిపించింది?
– తమన్నా చాలా ప్రొఫెషనల్‌. తను తప్ప మరో హీరోయిన్‌ ఉంటే చేయలేకపోయేవాడినేమో. సెట్స్‌కు వెళ్లే ముందు నేను, తమన్నా రిహార్సల్‌ చేసుకునేవాళ్లం. ఖాళీ సమయాల్లో ఇద్దరం కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. డాన్స్‌లో టాంగో డాన్స్‌ను ప్రొఫెషనల్స్‌తో 8 రోజుల పాటు ప్రాక్టీస్‌ చేశాం. ఈసినిమా టైటిల్‌ సాంగ్‌ను రెండున్నర గంటలో షూట్‌ చేశాం.

కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాతో రొమాంటిక్‌ హీరోగా మారాడనుకోవచ్చా?
– నాకు బేసిక్‌గా ట్యాగ్‌లైన్స్‌ అంటే నాకు భయం. భవిష్యత్‌లో రొమాంటిక్‌ సినిమాలొస్తే చేయడానికి నేను రెడీ. వైవిధ్యమైన సినిమాలు చేయాలనుకుంటున్నాను. గుహన్‌గారితో చేయబోయే సినిమా కూడా నాకు కొత్త జోనరే. నటుడిగా హద్దులు ఏర్పరుచుకోవాలనుకోలేదు.

నిర్మాతలు గురించి..?
-మహేశ్‌గారి వల్లనే కిరణ్‌, విజయ్‌లను కలిశాను. మేకింగ్‌లో కాంప్రజమైజ్‌కాకుండా సినిమాను అందంగా తెరకెక్కించడంలో వారి సహకారం ఎంతో ఉంది.

అసలు రొమాంటిక్‌ మూవీ చేయడం రిస్క్‌ అనిపించలేదా?
– ప్రతి సినిమా రిస్కేనండి.. ఎవరైనా ఇండస్ట్రీలో గ్యారంటీ హిట్‌ అవుతుందనే సినిమా తీస్తారా? లేదు కదా.. అందరూ హిట్‌ కొట్టాలనే ఆలోచనతోనే సినిమా చేస్తారు. ఉదాహరణకు బృందావనం ముందు వరకు తారక్‌ తన వయసుకు మించిన పాత్రలున్న సినిమాలు చేశారు. బృందావనం తర్వాత.. ప్రేక్షులు, డైరెక్టర్స్‌ ఆలోచన మారింది. ‘నాన్నకు ప్రేమతో..’ చిత్రం తనను నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లింది.

నిర్మాతగా సినిమా ఎప్పుడు చేస్తున్నారు?
– ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై పవన్‌సాధినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. గుణ్ణం గంగరాజుగారు కూడా వర్క్‌ చేస్తున్నారు. ఆయన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ రాస్తున్నారు. మల్టీస్టారర్‌ మూవీ ఇది. 15-20 రోజుల తర్వాత నటీనటులు, సాంకేతిక నిపుణులు అన్ని విషయాలు తెలుస్తాయి. తారక్‌తో 2019లో సినిమా చేస్తాను.

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌…?
– ఈ నెల 18నాటికి 50 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. గుహన్‌గారి సినిమాలో ఈ జూలై నాటికి నా పార్ట్‌ పూర్తవుతుంది. విరించి వర్మగారు కూడా ఫైనల్‌ వెర్షన్‌ కథ వినాల్సి ఉంది. ఆగస్టులో ఆ సినిమా స్టార్ట్‌ అయ్యే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here