మిస్సమ్మ సినిమా కి మొదట హీరోయిన్ గా భానుమతి ని తీసుకొని నాలుగు రీళ్ల సినిమా తీశారు. ఒకసారి వరలక్ష్మి వ్రతం చేసుకొని భానుమతి షూటింగ్ కి ఆలస్యంగా వచ్చింది. దానికి నిర్మాతలలో ఒకరైన నాగిరెడ్డి గారు కోపంతో భానుమతి ని క్షమాపణలు చెప్పమని అడిగారు. దానికి ఆవిడ ఒప్పుకోలేదు. కోపంతో నాగిరెడ్డి గారు తీసిన నాలుగు రీళ్ల సినిమాని కాల్చివేసి సావిత్రి ని హీరోయిన్ గా పెట్టుకొని మళ్ళా మిస్సమ్మ సినిమా తీశారు. మొదట భానుమతి తో తీసిన సినిమా తాలూకు కొన్ని సీన్లు క్రింద చూడొచ్చు.



