వి.వి.వినాయక్ తదుపరి చిత్రం ?

0
374

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం గా ‘ఖైదీ నెంబర్ 150 ‘ తో బ్లాక్ బస్టర్ అందించిన సెన్సషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తన తదుపరి సినిమా పనుల్లో ఉన్నారు. ‘ఆది’,’సాంబ’,’అదుర్స్’ వంటి హ్యాట్ ట్రిక్ సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, వి.వి .వినాయక్ కాంబినేషన్లో మరో సినిమా తీసేందుకు ఒక పెద్ద నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా ‘అదుర్స్’ సీక్వెల్ అయితే బావుంటుందని అభిమానులు కోరుకోవడం, ఆ విషయాన్ని చాల సందర్భాల్లో ఇద్దరూ ప్రస్తావించడం జరిగాయి. కాకపోతే ఇప్పుడు చర్చల్లో ఉన్న సినిమా ‘అదుర్స్ 2 ‘ నా లేక మరో సబ్జెక్టా అన్నది తెలియాలి.

ఇదిలా ఉండగా గతంలో వినాయక్ దర్శకత్వంలో పలు సినిమాలు తీసిన నిర్మాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, వినాయక్ కాంబినేషన్లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. వినాయక్ తదుపరి సినిమాగా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఉంటుందో లేక మరో కొత్త కంబినేషన్లో ఉంటుందో త్వరలో ఖరారు అవనున్నట్లు వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here