సూపర్ స్టార్ సెట్లో మెగా స్టార్

0
371

నిన్న సంతోష్ శివన్, మురుగదాస్ తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక పిక్ సర్వత్రా చర్చనీయాంశమైంది. సూపర్ స్టార్ మహేష్ తో మురుగదాస్ తీస్తున్న సినిమా సెట్ కి మెగా స్టార్ చిరంజీవి రావడమే అందుకు కారణం. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో చిరంజీవి నిర్వహిస్తోన్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో షూటింగ్ జరుగుతుండగా పక్కనే మహేష్, మురుగదాస్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. మేకప్ రూమ్ దగ్గిర ఎదురుపడ్డ చిరంజీవి, మహేష్ ఒకర్నొకరు పలకరించుకుని ఎవరి షూటింగ్ కి వాళ్ళు వెళ్లిపోయారు.

తన షూటింగ్ పూర్తయ్యాక చిరంజీవి పాట చిత్రీకరణ జరుపుకుంటున్న మహేష్ సినిమా సెట్ లో కి వచ్చారు. మహేష్, మురుగదాస్ తో కలిసి చిరు ని సాదరంగా ఆహ్వానించారు. చిరు, మహేష్ చాలా సేపు పలు విషయాల గురించి ముచ్చటించారు .ఈ సందర్భంగా మహేష్, మురుగదాస్ సినిమా గురించి, చిరు 151 వ సినిమా, రామ్ చరణ్ సినిమా విశేషాల గురించి మాట్లాడుకున్నారు. చిరంజీవి గతంలో మురుగదాస్ దర్శకత్వంలో ‘స్టాలిన్’ చేసిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్లో మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి అని వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here