జూన్ నుండి రామ్ చరణ్ – మణిరత్నం సినిమా

0
608

‘ధ్రువ’ లో టఫ్ కాప్ గా మెప్పించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో విభిన్నమైన సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ ఏ సినిమా చేయనున్నారనే దాని మీద రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నా, చరణ్ క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం తో సినిమా చేయడానికే మొగ్గు చూపారని సమాచారం. ఎప్పటినుండో ఊరిస్తున్న ఈ కాంబినేషన్ ఎట్టకేలకు తెరకెక్కనుంది. ‘మద్రాస్ టాకీస్’ పతాకం పై మణిరత్నం స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ సినిమా జూన్ నుండి ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో భారీగా రూపొందనున్న ఈ సినిమాలో చరణ్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అధికారక ప్రకటన త్వరలోనే వెల్లడించనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here