‘కిట్టు ఉన్నాడు జాగర్త’ మూవీ రివ్యూ

0
87

కథ :

అనుకోని పరిస్థితుల్లో జానకి (అను ఇమ్మానుయేల్) ని కలిసిన కిట్టు (రాజ్ తరుణ్) తనతో ప్రేమలో పడిపోతాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి స్వయంకృషి తో ఎదగాలని స్నేహితులతో కలిసి గ్యారేజ్ నడిపే కిట్టు తో జానకి కూడా ప్రేమలో పడిపోతుంది. ఒక అనుకోని సంఘటన తో కిట్టు కుక్కపిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాల్సి వస్తుంది. ఇది తెలుసుకున్న జానకి కిట్టు తో విడిపోతుంది. కిట్టు ఎందుకు ఆలా చేయాల్సొచ్చింది, చివరకి జానకి ప్రేమని ఎలా దక్కించుకున్నాడు అన్నది కథ.

నటన :

సీరియస్ పాత్రల్లో కాకుండా తనకి, తన వయసుకి తగ్గ పాత్రలు ఎంచుకోవడం రాజ్ తరుణ్ కి చక్కగా సరిపోతోంది. ఇందులో కూడా తన నటనకి తగ్గ మాములు కుర్రోడు పాత్రలో అమరిపోయాడు. చక్కని కామెడీ టైమింగ్ తో ఎక్కడ ఓవర్ ది టాప్ అనిపించకుండా మంచి ఎనర్జీ తో అలరించాడు. లవ్ సీన్స్ లో హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ పండించాడు.

అను ఇమ్మానుయేల్ అందంగా కనిపించింది. నటన పరంగా కూడా పర్వాలేదు అనిపించింది. రాజ్ తరుణ్ కి జోడిగా బాగా సరిపోయింది. ప్రేమ కథ బాగా రావడానికి వీరి పెయిర్ బాగా ఉపయోగపడింది. ఇక ఇతర పాత్రల్లో పృథ్వి ఆకట్టుకున్నాడు. ‘రేచీకటి’ ఉండే పాత్రలో పృథ్వి కడుపుబ్బా నవ్విస్తాడు. ఈ సినిమాలో కామెడీ కి మూల స్తంభంలో ఈ పాత్ర నిలిచింది. విలన్ పాత్రలో అర్బాజ్ ఖాన్ సరిపోయారు.

బలాలు :

కామెడీ
ఫస్ట్ హాఫ్
కథనం

బలహీనతలు :

కాస్త నెమ్మదించే సెకండ్ హాఫ్

విశ్లేషణ :

‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ కథ మాములే అయినప్పటికీ దర్శకుడు వంశీ కృష్ణ ఆకట్టుకునే కథనంతో ఆద్యంతం అలరించారు. సినిమా అంతా వినోదాన్ని, ప్రేమ కథని చక్కగా బాలన్స్ చేస్తూ వెళ్లారు. మొదటి అర్ధ భాగం అంతా వినోదం తో ఆకట్టుకుంటుంది. డైలాగు లు కూడా బాగా పేలడం తో కామెడీ సీన్ లు బాగా పండాయి. రెండవ అర్ధ భాగం కాస్త సీరియస్ గా నడిచినా ఆసక్తి కరంగా ఉంచడంలో దర్శకుడు విజయవంతం అయ్యారు. సెకండ్ హాఫ్ లో కామెడీ ఉన్నా మరి కాస్త జోడించివుంటే ఇంకా బావుండేది.

అనూప్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం బావున్నాయ్.సీన్స్ కలర్ ఫుల్ ఉండి కెమెరా పనితనం బావుంది. మంచి క్వాలిటీ తో నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా ఉన్నాయ్. యంగ్ టీం తో మంచి నాణ్యమైన వినోదాత్మకమైన సినిమా అందించిన నిర్మాత అనిల్ సుంకర అభినందనీయుడు.

బాటమ్- లైన్ : కడుపుబ్బా నవ్వించే ‘కిట్టు’
రేటింగ్ : 3.25 /5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here