“నా 100వ సినిమా గురించి నేనే అనౌన్స్ చేస్తాను” – అక్కినేని నాగార్జున

0
242

అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి…చిత్రాల త‌ర్వాత నాగార్జున – రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో వ‌స్తున్న‌నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. సాయికృపా ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుడు హ‌ధీరామ్ బాబా జీవిత క‌థ ఆధారంగా రూపొందిన ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో నాగార్జున‌తో ఇంట‌ర్వ్యూ…

`ఓం న‌మో వేంక‌టేశాయ` ఎలా ఉండ‌బోతుంది..?

– అన్న‌మ‌య్య వేరు…రాంబాబా వేరు. బాబా నార్త్ నుంచి తిరుప‌తి వ‌చ్చారు. కొంత మంది మ‌హారాష్ట్ర నుంచి వ‌చ్చారంటే మ‌రి కొంత మంది రాజ‌స్ధాన్ నుంచి వ‌చ్చారు అని చెబుతారు. అత‌నికి మ‌ర‌ద‌లు ఉంటుంది. వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న త‌ర్వాత అక్క‌డే ఉంటూ ఆయ‌న‌కు సేవ చేసుకుంటుంటాడు. ఆయ‌న న‌గ‌లు దొంగిలించాడ‌ని ఆరోపిస్తారు లేదంటే… చెరుకు గ‌డ‌లు అన్ని వేసి వీటిని తిని నిరూపించుకోమంటారు. అప్పుడు స్వామి ఏనుగు రూపంలో వ‌చ్చి తినేస్తాడు ఇలా ఈ సినిమా ఉంటుంది. హ‌ధీరామ్ బాబా ఎమోష‌న్ క్యారెక్ట‌ర్. స్వామికీ, హ‌ధీరామ్ బాబాకి మ‌ధ్య జ‌రిగేవి చాలా ఇంట్ర‌స్టింగ్ గా చాలా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటాయి.

ఈ క్యారెక్ట‌ర్ గురించి…?

– డైరెక్ట‌ర్‌ రాఘ‌వేంద్ర‌రావు గారు ఈ క్యారెక్ట‌ర్ కి గెడ్డం ఉంటే బాగుంటుంది అన‌డంతో పెంచాను. క‌థ విష‌యానికి వ‌స్తే యూత్ క‌నే కాదు అన్ని వ‌య‌సుల వాళ్ల‌కి ఈ సినిమా న‌చ్చుతుంది అనుకుంటున్నాను. హ‌ధీరామ్ బాబా వ‌య‌సు ఎనిమిది సంవ‌త్స‌రాల నుంచి యాభై సంవ‌త్స‌రాల వ‌ర‌కు చూపించాం. క‌రెక్ట్ గా ఇంత వ‌ర‌కే చూపించాలి అని ఏజ్ పై కాన్ స‌న్ ట్రేష‌న్ చేయ‌లేదు.

ప్ర‌గ్యా జైస్వాల్, అనుష్క క్యారెక్ట‌ర్స్ గురించి..?

– ప్ర‌గ్యా జైస్వాల్ హ‌ధీరామ్ బాబా మ‌ర‌ద‌లు క్యారెక్ట‌ర్ చేసింది. హిస్ట‌రీలో కూడా హ‌ధీరామ్ బాబాకి మ‌ర‌ద‌లు ఉంది. ఇక అనుష్కతో నాకు రొమాన్స్ ఏమీ ఉండ‌దు. త‌ను చిన్న‌ప్ప‌టి నుంచి ఆ స్వామినీ చూసి స్వామే స‌ర్వ‌స్వం అనుకుంటుంది. క‌థ విష‌యంలో చూస్తే మాకు త‌క్కువ స‌మాచార‌మే ల‌భించింది. కీర‌వాణి గారి అద్భుత‌మైన పాట‌లు అందించారు. ఆనందం సాంగ్, గోవింద నామాలు …ఇలా ప్ర‌తి పాట చాలా బాగుంది.

కథ విన్న‌ప్పుడు ఏమ‌నిపించింది?

– నిజ‌మే అన్న‌మ‌య్య కంటే గొప్ప క‌ధ ఉంటుందా అనుకున్నాను. ముందు ఎందుకులెండి అని కూడా అన్నాను. అయితే వారు క‌థ‌ను ఒక‌సారి విన‌మ‌ని, క‌థ చెప్పిన‌ప్పుడు చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంద‌ని స‌ర్ ఫ్రైజ్ గా ఫీల‌య్యాను.

ఈ సినిమాలో హైలెట్స్ ఏమిటి..?

– నాలుగు ముఖ్య ఘ‌ట్టాలు ఉన్నాయి అవి ఈ చిత్రానికి హైలెట్స్ గా నిలుస్తాయి. మెయిన్ గా లాస్ట్ 10 నిమిషాలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.

ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి స‌క్సెస్ సాధించాయి మీరేమంటారు..?
– రెండు పెద్ద సినిమాల మ‌ధ్య శ‌త‌మానం భ‌వ‌తి వ‌చ్చి స‌క్సెస్ సాధించింది. దిల్ రాజు గారు క‌రెక్ట్ గా ప్లాన్ చేసి రిలీజ్ చేసారు. సోగ్గాడే చిన్ని నాయ‌నా కి మేము అలాగే క‌రెక్ట్ గా ప్లాన్ చేసి రిలీజ్ చేశాం.

ఓం న‌మో వేంక‌టేశాయ‌ను త‌మిళ్ లో కూడా రిలీజ్ చేయ‌చ్చు క‌దా..?

– త‌మిళ్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలి అని ప్లాన్ ఉంది. కాక‌పోతే ఫ‌స్ట్ తెలుగులో రిలీజ్ చేసిన త‌ర్వాత త‌మిళ్, హిందీలో రిలీజ్ చేయాలి అనుకుంటున్నాం.

వెంక‌టేశ్వ‌ర‌స్వామి పాత్ర‌కు సౌర‌భ్ జైన్ ని తీసుకోవ‌డానికి కార‌ణం..?

– వెంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం ఇందులో చూపిస్తున్నాం అంటే స్వామి యంగ్ గా ఉండాలి. పైగా వెంక‌టేశ్వ‌ర స్వామి నిత్య య‌వ్వ‌నంతో ఉంటారు. అలా యంగ్ గా క‌నిపిస్తూ ఆ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి మ‌న ద‌గ్గ‌ర ఉన్న వాళ్ల‌లో ఎవ‌రూ సెట్ కారు అనిపించింది అందుక‌నే సౌర‌భ్ జైన్ ని సెలెక్ట్ చేశాం.

రాఘ‌వేంద్ర‌రావు గారి ఆఖ‌రి సినిమా ఇదే అన్నారు..నిజ‌మేనా..?

– ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు రాఘ‌వేంద్ర‌రావు గారు ఇదే నా ఆఖ‌రి సినిమా అని చెప్పేవారు. అందుక‌ని రాఘ‌వేంద్ర‌రావు గారు ఆఖ‌రి సినిమా అంటున్నారు ఇది అబ‌ద్ధం కావాలి అని చెప్పాను.

అఖిల్ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు…ఎప్పుడు ప్రారంభం..?

– అఖిల్ కోసం విక్ర‌మ్ కుమార్ ఫ‌స్ట్ ఓ లైన్ చెప్పాడు అది ముందుకు వెళ్ల‌డం లేదు. దీంతో ఆ స్టోరీ ఆపేసి వేరే లైన్ చెప్పాడు ఇది చాలా బాగుంది. ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచేలా ఈ సినిమా ఉంటుంది. ఫిబ్ర‌వ‌రిలో నెలాఖ‌రున ఈ సినిమాని ఎనౌన్స్ చేస్తాను.

చైత‌న్య – క‌ళ్యాణ్ కృష్ణ సినిమా ఎంత వ‌ర‌కు వ‌చ్చింది..?

– ఇప్ప‌టికి 50 శాతం పూర్తైంది. మార్చి నెలాఖ‌రుకు ఈ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. నిన్నే పెళ్లాడ‌తా త‌ర‌హా ఉండే సినిమా ఇది. అంతా బాగా వ‌చ్చింది అనుకున్న త‌ర్వాతే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాను.

మీ 100వ సినిమా ద‌గ్గ‌ర ప‌డుతుంది క‌దా..?

– అభిమానుల లెక్క‌ల ప్ర‌కారం అయితే 100వ సినిమాకి ద‌గ్గ‌ర‌ల్లో ఉన్నాను కానీ…గెస్ట్ రోల్ చేసిన సినిమాల‌ను కూడా నా సినిమాగా లెక్కేయ‌డం క‌రెక్ట్ కాదు అని నా అభిప్రాయం. నాకంటూ ఓ లెక్క ఉంది. ఆ లెక్క 100కి వ‌చ్చిన‌ప్పుడు నేనే ఎనౌన్స్ చేస్తాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?

– రాజుగారి గ‌ది2లో నా పార్ట్ షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నాను. త‌ర్వాత బంగార్రాజు ప్రీక్వెల్ చేయాలి. చందు క‌థ చెప్పాడు. త్వ‌ర‌లోనే ఫుల్ స్టోరీ చెబుతాను అన్నాడు. క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here