ఈనెల 27న లారెన్స్‌ `శివ‌లింగ` ఆడియో

0
470

కొరియోగ్రాప‌ర్ ట‌ర్న్‌డ్ డైరెక్ట‌ర్ కం హీరో లారెన్స్ న‌టించిన ‘శివ‌లింగ’ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. పి.వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన `శివ‌లింగ` చిత్రాన్ని అదే టైటిల్ తో రీమేక్‌గా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ లైక్ ల‌తో యూ ట్యూబ్ లో దూసుకుపోతుంది. పోస్ట‌ర్ల తో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు లారెన్స్ .

తాజాగా సినిమా ఆడియోను ఈ నెల 27 న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ “కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘శివలింగ ‘. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీజ‌ర్ , పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈనెల 27న ఆడియో, అలాగే సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని` అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here