అంజలి కథానాయికగా `పిల్లజమీందార్` ఫేం అశోక్ దర్శకత్వం వహించిన సినిమా `చిత్రాంగద`. ఈ సినిమా రిలీజ్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా `చిత్రాంగద` రిలీజ్ తేదీ లాక్ అయ్యింది. ఫిబ్రవరి 10న రిలీజ్ చేయనున్నామని దర్శకనిర్మాతలు ప్రకటించారు. తెలుగులో `చిత్రాంగద` పేరుతో, తమిళంలో `యార్నీ` అనే టైటిల్‌తో ఈ చిత్రం రిలీజ్ కానుంది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా చిత్రాంగద ఎలాంటి చిక్కుల్లో పడింది? అన్నదే కాన్సెప్ట్.
ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే చక్కని హారర్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని తెలిపారు. సినిమాలో అంజలి పాడిన పాట హైలైట్‌గా ఉంటుందని తెలిపారు. హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్‌లో వస్తున్న `చిత్రాంగద` ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


