సునామీని సునామీ ఢీకొట్టే క‌థను ఆరోజుల్లోనే చెప్పారు!- రాజ‌మౌళి

0
411

స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `శ్రీ‌వ‌ల్లీ` ఆడియోని ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి లాంచ్ చేశారు. అనంత‌రం జ‌క్క‌న్న అన్న మాట‌లు ఆస‌క్తి రేకెత్తించాయి. హాలీవుడ్ త‌ర‌హా క‌థ‌ల్ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఆరోజుల్లోనే రాశార‌ని తెలిపారు.

శ్రీ‌వ‌ల్లీ` ఆడియో ఆవిష్క‌ర‌ణ వేడుక‌లో ముఖ్య అతిధి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ-“కెరీర్ ఆరంభం నేను అసిస్టెంట్ రైట‌ర్‌గా నాన్న‌గారి వ‌ద్ద ప‌నిచేశా. నాన్న‌గారు తెలుగు జ‌నాల‌కు స‌రిప‌డే క‌థ‌ల్ని రాసేవారు. కానీ నాన్న‌గారు చిన్న‌ప్ప‌టినుంచి ఇంగ్లీష్ న‌వ‌ల‌లు చ‌దివేవారు. అలాంటివి తీయ‌కుండా ఇదేంటి? అన్నాను. అయితే ఆయ‌న ఓ క‌థ చెప్పారు. ర‌ష్యా న్యూక్లియ‌ర్ వెప‌న్స్ అన్నీ ప‌సిపిక్‌లో దాచుకుంటోంది. ఆ టైమ్‌లో స‌ముద్రంలో టెక్నో ప్లేట్స్ క‌దిలి ఘ‌ర్ష‌ణ వ‌ల్ల అణుబాంబ్‌ల‌న్నీ పేలిపోతాయి. ఆ పేలుడుకు సునామీ వ‌స్తుంది. ప‌క్క‌నే ఉన్న‌ జ‌పాన్‌ని ముంచేస్తుంది. అర్థ‌గంట‌లో అమెరికా ఆపోజిట్లో అణుబాంబులు పేల్చి ఆపోజిట్ సునామీని సృష్టిస్తుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అన్న‌దే సినిమా.. అంటూ క‌థ చెప్పారు. ఆరోజుల్లోనే ఆయ‌న ఇలాంటి క‌థ చెప్పారు. ఇప్ప‌టికి నాకు అర్థ‌మైంది“ అంటూ గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీ‌వ‌ల్లీ చిత్రాన్ని విజ‌యేంద్రుడు అద్భుతంగా తెర‌కెక్కించి ఉంటార‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here