గతేడాది ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’,’జెంటిల్ మాన్’,’మజ్ను’ లతో హ్యాట్-ట్రిక్ సక్సెస్ లు అందుకున్న యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని మరో హ్యాట్-ట్రిక్ కి సిద్ధం అవుతున్నారు. సంక్రాంతి కి ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో లేటెస్ట్ సెన్సేషన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా ‘సినిమా చూపిస్తా మావ’ ఫేమ్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేను లోకల్’ ఫిబ్రవరి ౩న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఈ మధ్యే విడుదల అయ్యి చార్ట్ బస్టర్ గ నిలిచింది.


