`శ‌త‌మానం భ‌వ‌తి’ కి పెట్టిన డ‌బ్బు మూడు రోజుల్లో వచ్చేయడం ఆనందంగా ఉంది – దిల్‌రాజు

0
49

స‌క్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా, నిర్మాత‌గా రాణిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నిర్మాత దిల్‌రాజు. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కుల్లో సినిమాపై మంచి అంచ‌నాలు మొద‌ల‌వుతాయి. బొమ్మ‌రిల్లు, కొత్త‌బంగారు లోకం, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు ఇలా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన దిల్‌రాజు నిర్మాత‌గా శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సతీష్‌ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘శతమానంభవతి`. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమా జ‌న‌వ‌రి 14న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజు పాత్రికేయుల‌తో సినిమా స‌క్సెస్ గురించి మాట్లాడారు….

సినిమా స‌క్సెస్ రెస్పాన్స్ ఎలా ఉంది?
– ఈస్ట్‌, వెస్ట్‌, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో నా రెగ్యుల‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్‌కే సినిమాను ఇచ్చేశాను. ఈ మ‌ధ్య కాలంలో ఇంత మంచి రెవెన్యూ నా సినిమాల‌కు రాలేద‌నే చెప్పాలి. మూడో రోజుకే వారు పెట్టిన డ‌బ్బులు వ‌చ్చేశాయ‌ని డిస్ట్రిబ్యూట‌ర్స్ అన్నారు. సినిమాపై పాజిటివ్ బ‌జ్ రావ‌డం, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కృష్ణా, వైజాగ్‌, నైజాంలో సినిమాను మేమే రిలీజ్ చేశాం. ఈ సినిమాకు మూడు రోజుల్లో వారు పెట్టిన డ‌బ్బు వ‌చ్చేసి నాలుగో రోజుకు ఓవ‌ర్‌ఫ్లో రావ‌డం ఆనందంగా ఉంది. `శ‌త‌మానం భ‌వ‌తి` చిత్రానికి అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది.

స‌తీష్ వేగేశ్నతో సినిమా చేయ‌డానికి కార‌ణం?
– ఇంత‌కు ముందు స‌తీష్ వేగేశ్న మా బ్యాన‌ర్‌లో రూపొందిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేశారు. ఆ ర్యాపో వ‌ల్ల ఓసారి న‌న్ను క‌లిసి సార్‌..నా ద‌గ్గ‌ర ఓ పాయింట్ ఉంది వింటారా..అని అన్నాడు. స‌రేన‌ని అన్నాను. త‌ను చెప్పిన పాయింట్ నాకు బాగా న‌చ్చింది. త‌ప్ప‌కుండా మ‌నం ప‌నిచేద్దామ‌ని, ఒక సంవ‌త్స‌రం పాటు క‌థ‌పై వ‌ర్క్ చేశాం. ప్ర‌కాష్ రాజ్‌గారు, హీరో నాని కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చారు. అలా న‌లుగురైదుగురు నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని చేశాం.

క‌థ విన‌గానే ఏమ‌నిపించింది?
– క‌థ విన్న‌ప్పుడు కానీ, సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు కానీ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌ని గట్టిగా న‌మ్మాను. ఆ న‌మ్మ‌కం నిజ‌మైనందుకు ఆనందంగా ఉంది. నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యే శ్రీధ‌ర్‌రెడ్డి సినిమా చూడ‌గానే ఫోన్ చేసి సినిమా గురించి చాలా బాగా మాట్లాడారు. ఓ పొలిటీషియ‌న్ సినిమాను ఇంత బాగా అనాలసిస్ చేస్తారా అనిపించింది. అంతే కాకుండా నెల్లూరు ప్రెస్ కాన్ఫ‌రెన్స్ పెట్టి సినిమా చూడాల‌ని అనౌన్స్ చేశారు.
సంక్రాంతి పోటీలో సినిమాను ఎన్ని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేశారు?

అన్నీ సినిమాలు ఆడుతున్నాయి…
– రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేశాం. రెండు పెద్ద సినిమాల‌తో పాటు శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం కూడా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. నాకు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం మూడు సినిమాలు విజ‌య‌వంతంగా ర‌న్ అవుతున్నాయి. ఓవ‌ర్‌సీస్‌లో కూడా సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఓవ‌ర్‌సీస్‌లో వ‌న్ మిలియ‌న్ రీచ్ అయ్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాన్నిస‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here