కరోనా సహాయనిధికి బ్రహ్మనందం విరాళం….!!

0
657
Comedian Brahmanandam Announced 3 Lakhs

ప్రస్తుతం కరోనా వ్యాధి కల్లోలంతో ప్రపంచం మొత్తం కూడా అల్లాడుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు కూడా పూర్తిగా లాకౌట్లు ప్రకటించి ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసాయి. అయితే ఆ విధంగా సామజిక దూరం పాటించకపోతే ఈ మహమ్మారి మరింతగా వ్యాప్తి చెందుతుందని భావించిన పలు దేశ ప్రభుత్వాలు ఇలా లాకౌట్లు ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే దీనివలన ఇళ్ల నుండి బయటకు రాలేక, చేయడానికి పని లేక, పేద, దిగువ వర్గాల వారికి పూర్తిగా పూట గడవని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇది గ్రహించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఆర్ధిక సాయాన్ని ప్రకటించినప్పటికీ, పలు ఇతర రంగాల ప్రముఖులు కూడా ముందుకు వచ్చి అటువంటివారికి చేయూతగా నిలుస్తూ విరాళాలు అందిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుండి కూడా ఇప్పటికే చాలా మంది తమ గొప్ప మనసుతో విరాళాలు అందివ్వగా, నేడు బ్రహ్మానందం రూ.3 లక్షల విరాళాన్ని, మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన కరోనా విపత్తు నిధికి అందచేస్తున్నట్లు ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here