‘పడి పడి లేచె మనసు’ కి వస్తున్న ఫీడ్ బ్యాక్‌ పట్ల నేను చాలా హ్యాపీ – సాయి పల్లవి

0
381

ఫిదా, ఎం సి ఏ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి తాజాగా యంగ్ హీరో శర్వానంద్‌ తో జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. చెరుకూరి సుధాకర్‌ నిర్మాత. డిసెంబర్‌ 21న సినిమా విడుదలై సక్సస్ ఫుల్ గా రన్ అవుతోన్న సందర్భం గా హీరోయిన్ సాయి పల్లవి ఇంటర్వ్యూ…

తెలుగు తమిళ్ లో ఒకే రోజు మీ సినిమాలు రిలీజ్ కావడం ఎలా అనిపించింది?
– ఇటు తెలుగు, అటు తమిళ్‌లో రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అనేది నాకు కొత్తగా అనిపిస్తుంది. రెండు సినిమాలను జనవరి నుండి సమాంతరంగా షూట్‌ చేస్తూ వస్తున్నాం. అలాగే రిలీజ్‌ కూడా ఒకేసారి అయ్యింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది.

సినిమా ఫలితాలను పరిగణలోకి తీసుకుంటారా?
– మనం ఏదీ చేసిన మనస్ఫూర్తిగా చేయాలి. ఫలితాన్ని ఆ దేవుడికే వదిలెయ్యాలి. ఆయన ఏది ఇచ్చినా దాన్ని స్వీకరించాలి కదా. నటిగా ‘పడి పడి లేచె మనసు’ కి వస్తున్న ఫీడ్ బ్యాక్‌ పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏదీ జరిగినా మన మంచికే అని ఫీలవుతాను.

ఈ మధ్య కాలం లో మీరు ఎక్కువగా డామినెటే చేస్తారు అని వినబడుతుంది?
– నటన నేర్చుకుని నేను సినిమాల్లోకి రాలేదు. వైశాలి అనే క్యారెక్టర్‌ ఎలా అబ్బాయిని ఇష్టపడుతుంది .. ఏమవుతుందనేదే కథ. నేను, శర్వా ఆ క్యారెక్టర్స్‌ను ఫీలై చేశాం. నటనలో ఇద్దరికీ ఫీలింగ్‌ ఉంటేనే అది తెరపై కనపడుతుంది. నేను ఎవరినీ డామినేట్‌ చేయను. డామినేట్‌ చేస్తానని ఎవరూ చెబుతున్నారో తెలియడం లేదు.

మొదటి సారి డాక్టర్ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది?
ఈ సినిమాలో మెడికోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆ పర్టికులర్‌ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నాకు రెండేళ్ల ముందు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నా అనుభవాలే నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. అలాంటి అనుభవాలను మరచిపోతే ఎలా? కాబట్టి అనుభవాలను మరచిపోకూడదనుకుంటాను.

హీరో శర్వానంద్ గురించి?
శర్వానంద్‌ చాలా ఫ్రెండ్లీ.  హీరోయిన్‌ మొన్ననే వచ్చింది కదా!, తను జూనియర్‌ అనే ఫీలింగ్‌ తనకు ఉండదు. నాకు చాలా కంఫర్ట్‌ ఇచ్చారు శర్వా. నేను, తను మంచి స్నేహితులమయ్యాం. మా ఇద్దరికీ ఈగోలు లేవు. మేం ఎక్కడా ఇబ్బంది పడలేదు.చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాము.

డైరెక్టర్ హను రాఘవపూడి వర్కింగ్ స్టైల్ గురించి?
హను చాలా హార్డ్ వర్కర్, సినిమా పట్ల పూర్తి బాధ్యతతో ఆలోచిస్తారు. ఈ సినిమాకు తాను చాలా కష్టపడి లొకేషన్స్ ను సెట్ చేశారు. అలా లొకేషన్స్ లో చాలా సార్లు గాయపడ్డారు కూడా అయినా అంతా నా సినిమా కోసమే అనుకొనే వ్యక్తి. ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ గారితో పనిచెయ్యడం చాలా హ్యాపీ.

నిర్మాత సుధాకర్‌ చెరుకూరి గురించి?
– సుధాకర్‌గారు చాలా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. ఈ సినిమా కథకి ఏమేం కావాలో అవి ఖచ్చితంగా సమకూర్చారు. ఇలాంటి టేస్ట్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ ఉండటం తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. సినిమా ఇంత బాగా వచ్చిందంటే ఆయనే కారణం.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
మలయాళం లో ఒక సినిమా చేస్తున్నాను. తమిళ్ లో సూర్యగారితో ఎన్ జీ కె సినిమా ఉంది. తెలుగులో సినిమా ఇంకా చర్చల దశలోనే ఉంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్ సాయి పల్లవి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here