ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేను లేను”. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరోగా (తొలి ప‌రిచ‌యం) న‌టిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ సంద‌ర్భంగా

ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ … ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూడ‌ని వినూత్న‌మైన క‌థ‌నంతో తెర‌కెక్కిన చిత్రం నేను లేను . అందమైన లొకెషన్స్ లొ చిత్రీకరణ పూర్తయింది.ఫస్ట్ లుక్ ను విడుదల చెశాము. నవంబర్ 12 న చిత్ర టీజ‌ర్‌ను విడుదల చెస్తున్నాము. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చెస్తామన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలుఃజోజో, నిర్వాహ‌ణ:సురేష్‌కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌:సాయిస‌తీష్‌ విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్:పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ:రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్ః క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌