డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతున్న ‘47డేస్’

0
101

సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ వైజాగ్ , అరకు, గోవా, హైదారాబాద్ లలో పూర్తి చేసుకుంది.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. కంప్లీట్ టెక్నిషియన్స్ సినిమా గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ అవుట్ పుట్ తెలిసిన త్రిశూల్ సినిమా ఫ్యాన్సీ రేట్ కు Over seas హక్కులు దక్కించుకుంది.

తెలుగు ప్రేక్షకులకు ‘47డేస్’ చిత్రం సరికొత్త అనుభూతి ఇస్తుందని నమ్మకంగా చెబుతుంది చిత్ర యూనిట్ . సస్పెన్స్ థ్రిల్లర్ ముఖ్య కథాంశంగా వస్తోన్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగా ఉంటాయని అంటుంది చిత్ర యూనిట్. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచే ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సత్యదేవ్, పూజాజవేరి, రోహిణి ప్రకాష్ ,సత్య ప్రకాష్ రవివర్మ , శ్రీకాంత్ శర్మ ,ఇర్ఫాన్ ,ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి

కో ప్రొడ్యూసర్ : అనిల్ కుమార్ షొంఠి, సినిమాటోగ్రఫీ : జికే, సంగీతం : రఘు కుంచే , ఎడిటర్ : ఎస్ఆర్. శేఖర్, డిజైన్స్ – అనిల్ భాను, యాక్షన్ -శ్రీ
పి.ఆర్.వో : జి.ఎస్.కే మీడియా, పాటలు : భాస్కరభట్ల, లక్ష్మీ భూపాల్,విశ్వ , ప్రీతి కేశవన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here