గోపిచంద్-సంప‌త్‌నంది `గౌతమ్‌నంద‌` ఫ‌స్ట్‌లుక్ లాంచ్‌

0
503

జిల్‌, లౌక్యం వంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాల త‌ర్వాత ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ ఒకేసారి రెండు సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం `ఆక్సిజ‌న్‌` సినిమాతో పాటు సంపత్ నంది కాంబినేష‌న్‌లో సినిమా  సెట్స్‌పై ఉంది.

గోపిచంద్‌- సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రానికి `గౌత‌మ్‌నంద‌` టైటిల్‌ని క‌న్ఫ‌మ్ చేసి, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌నిని లాంచ్ చేశారు.  గోపిచంద్ ఇమేజ్‌కి త‌గ్గ టైటిల్ ఇది. హ్యాట్రిక్ హిట్ సినిమాల ద‌ర్శ‌కుడిగా సంప‌త్‌నంది ఈ చిత్రంలో గోపిచంద్‌ని మ‌రో కొత్త కోణంలో ఎన‌ర్జిటిక్‌గా, మాసీగా చూపించ‌బోతున్నాడని అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ లుక్ కోసం గోపిచంద్ చాలానే క‌స‌ర‌త్తు చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. గోపిచంద్‌ మునుపెన్న‌డూ క‌నిపించ‌నంత స్టైలిష్‌గా, స్మార్ట్‌గానూ క‌నిపిస్తున్నాడు.

శ్రీ‌బాలాజీ సినీమీడియా అధినేత‌లు, నిర్మాత‌లు జె.భ‌గ‌వాన్‌, పుల్లారావు మాట్లాడుతూ-“ఈనెల 24తో చివ‌రి షెడ్యూల్ పూర్త‌వుతుంది. అటుపై పాట‌ల చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నున్నాం. ఏప్రిల్‌లో సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఫ‌స్ట్‌లుక్‌తో ఆక‌ట్టుకున్న గోపిచంద్ గౌతమ్‌నందాగా కొత్త‌గా క‌నిపిస్తాడు“ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here