క‌ళాబంధు టీఎస్సార్‌ నిర్మాత‌గా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్‌-ప‌వ‌ర్‌స్టార్ మ‌ల్టీస్టార‌ర్‌

0
359

మెగాస్టార్ – ప‌వ‌ర్‌స్టార్ క‌ల‌యిక‌లో ఓ సినిమా అభిమానుల ముందుకు వ‌స్తే.. ఆ కిక్కే వేరు క‌దూ? ఎస్‌.. అందుకు ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. మెగాస్టార్ చిరంజీవి-ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇరువురిని ఒకే ఫ్రేమ్‌లో చూసుకునే ఛాన్స్ మెగా ఫ్యాన్స్‌కి ద‌క్క‌నుంది. ఈ క్రేజీ కాంబినేష‌న్‌కు క‌ళాబంధు, నాటి మేటి నిర్మాత‌ టి.సుబ్బ‌రామిరెడ్డి అందుకు అంకురార్ప‌ణ చేశారు. మెగా ప్రొడ్యూస‌ర్ సి.అశ్వ‌నిద‌త్‌తో క‌లిసి మెగాస్టార్ చిరంజీవి-ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌ల‌యిక‌లో ఓ సినిమా నిర్మించేందుకు టి.సుబ్బ‌రామిరెడ్డి బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక ర‌చించారు. ఈ విష‌యాన్ని టీఎస్సార్ ఇదివ‌ర‌కే ఓ సంద‌ర్భంలో ప్ర‌క‌టించిన సంగ‌తి విధితమే. అయితే ఆ త‌ర్వాత ప‌లు ప‌ర్యాయాలు మెగాస్టార్‌, ప‌వ‌ర్‌స్టార్‌ల‌తో మంత‌నాలు సాగించిన టీఎస్సార్ అట్నుంచి ఓకే చేయించి, తుదిగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ను ఒప్పించి మెగా-ప‌వ‌ర్‌ ప్రాజెక్టుకి లైన్ క్లియ‌ర్ చేశారు. ఈ విష‌యాన్ని టీఎస్సార్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ద‌శాబ్ధాల పాటు ఇండ‌స్ట్రీని ఏలిన మెగాస్టార్ తిరిగి `ఖైదీనంబ‌ర్ 150` చిత్రంతో రీఎంట్రీ ఇవ్వ‌డం, వ‌స్తూనే రికార్డులు సాధించిన నేప‌థ్యంలో టీఎస్సార్ ఈ భారీ బ‌డ్జెట్ సినిమాకి తెర‌లేపారు.

నేడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో మంత‌నాలు సాగించిన అనంత‌రం.. టి.సుబ్బ‌రామిరెడ్డి మాట్లాడుతూ -“ఖైదీనంబ‌ర్ 150` సినిమాలో మెగాస్టార్‌ని చూశాక నేను నిర్మాత‌గా రీఎంట్రీ ఇచ్చే టైమ్ వ‌చ్చింద‌నిపించింది. వెంట‌నే త్రివిక్ర‌మ్‌ని క‌లిశాను. నేడు రెండోసారి త్రివిక్ర‌మ్ నా స్వ‌గృహంలో క‌లిశాక ప్రాజెక్టును ఫైన‌లైజ్ చేశాం. అశ్వ‌నిద‌త్‌తో క‌లిసి ఈ సినిమా నిర్మించ‌డం సంతోషాన్నిస్తోంది“ అన్నారు. మెగాస్టార్ హీరోగా టీఎస్సార్ ఇదివ‌ర‌కే `స్టేట్ రౌడీ`(1989) చిత్రాన్ని నిర్మించారు. అలాగే టీఎస్సార్ శోభ‌న్‌బాబు, ర‌జ‌నీకాంత్ వంటి స్టార్ల‌తోనూ ఆయ‌న సినిమాలు నిర్మించారు. జీవ‌న పోరాటం (1986), గ్యాంగ్ మాస్ట‌ర్ (1994) వంటి చిత్రాల్ని టీఎస్సార్ నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here