డా.గుర్ మీత్ రామ్ రహీమ్ సింగ్ టైటిల్ పాత్రలో నటించిన ‘లయన్ హార్ట్’ చిత్రం భారీ కలెక్షన్స్‌తో సక్సెస్‌పుల్‌గా అర్ధ శత దినోత్సవం పూర్తి చేసుకుంది. ఐదు వారాలకే 350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను వసూల్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలాంటి భారీ హిట్‌ను సాధించిన ఎం.ఎస్.జి లయన్ హార్ట్‌కు సీక్వెల్‌గా డా.గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఇన్సాన్ హనీ ప్రీత్ ఇన్సాన్ దర్శకత్వంలో హకికత్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి బ్యానర్‌పై `హింద్ కా `నాపక్ కో జవాబ్“ ఎం.ఎస్.జి లయన్ హార్ట్ -2 చిత్రాన్ని ఈ సినిమాను నిర్మించారు.
ఈ సీక్వెల్లో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించారు. రీసెంట్గా భారత సరిహద్దుల్లోని పాకిస్థాన్ సైన్యంపై భారత దేశ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్ బేస్డ్ కాన్సెప్ట్‌తో సాగే కథాంశం తో, భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి ౧౦ న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా…డా. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాట్లాడుతూ – “దురదృష్టవశాతు మన దేశంలో సర్జికల్ స్ట్రైక్స్ ఏం చేశారు, ఎలా చేశారనే దానిపై చాలా మంది ఆధారాలు అడుగుతున్నారు. అటువంటి వారికి ఈ సినీ మీడియా ద్వారా సమాధానం ఇవ్వబోతున్నాం. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన చాలా వివరాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం. జిహాద్ అనే నినాధంతో ముష్కరులు యువతను ఎలా పెడతోవ పట్టిస్తున్నారో మనకు తెలుస్తుంది. కానీ అసలు జిహాద్ అసలు అర్థాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇండియాలో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, సిక్కిం, కేరళ తదితర ప్రాంతాల్లో అద్భుతమైన లోకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించాం“ అన్నారు.
హనీ ప్రీత్ ఇన్సాన్ ఈ సినిమాకు కోడైరెక్టర్‌గా వర్క్ చేయగా, తండియాల్ సినిమాటోగ్రఫీ విషయంలో సహకారాన్ని అందించారు.


