పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మిస్తున్న క్రేజీ సినిమా `కాటమరాయుడు`. ఈ సినిమా టీజర్ లాంచ్ ఎప్పుడు?.. ప్రస్తుతానికి సస్పెన్సే. సంక్రాంతికే టీజర్ రావాల్సింది.. వాయిదా పడింది. మరోసారి జనవరి 26 టీజర్ వచ్చేస్తోందంటూ ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా మారింది. ఈ విషయాన్ని నిర్మాత శరత్‌మరార్ స్వయంగా ప్రకటించారు.
“జనవరి 26న కాటమరాయుడు టీజర్ రావడం లేదు. కొత్త తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం..“ అంటూ శరత్‌మరార్ తెలిపారు. అయితే జనవరి 26న విశాఖ బీచ్‌లోఓ ఏపీ ప్రత్యేక హోదా గురించి విద్యార్థులంతా మౌనపోరాటం చేస్తున్నారు. అందుకు పవన్ మద్దతునిచ్చారు. ఇలాంటి టైమ్‌లో టీజర్ లాంచ్ సరికాదని భావించి వాయిదా వేశారా? అని చెప్పుకుంటున్నారు.


