‘ది సెస్సో’ ట్రైలర్‌కు మంచి స్పందన: త్వరలో విడుదల
గ్రేస్‌గ్రిట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై యష్ రాజ్, మౌపియా గోస్వామి, పూజా రెడ్డి, ఈశ్వర్ ముఖ్యతారాగణం లో యష్ రాజ్ రచన, దర్శకత్వంలో బీఎన్ రవి నిర్మిస్తున్న‘ది సెస్సో’ చిత్రం ట్రైలర్ ఇటీవలే యూట్యూబ్ లో విడుదల అయ్యి తెలుగు ప్రేక్షకులని ఆకర్షించింది. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతుంది.
ప్రేమలో నమ్మకద్రోహం, అవమానాలతో తనపై తనకు నమ్మకం కోల్పోయిన కార్తీక్ (యష్ రాజ్) అనే యువ ఐటీ ఉద్యోగి, మరోవైపు సమాజం వేసే నిందలు, వేధింపుల వల్ల ఎవరికీ చెప్పుకోలేని బాధలో ఉన్న షమ్రిన్ (మౌపియా గోస్వామి) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీరిద్దరూ కలుసుకున్నప్పుడు నమ్మకం, ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటి భావోద్వేగాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. త్వరలోనే థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం నమ్ముతోంది.
ఇటీవల ఈ చిత్రం లోని ‘ఏదో ఏదో’ అనే మొదటి పాట ను విడుదల చేసారు. తర్వాత హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఆకాష్ జగన్నాథ్, అశోక్ యాదవ్ కలిసి ట్రైలర్ ను విడుదల చేసారు. ఇప్పుడు ఆ ట్రైలర్ సోషల్ మీడియా లో హుల్ చల్ చేస్తుంది. అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు, సాంకేతిక బృందం
ఈ చిత్రంలో కార్తీక్‌గా యష్ రాజ్, షమ్రిన్‌గా మౌపియా గోస్వామి, ప్రియాంకగా పూజా రెడ్డి, అర్జున్‌గా ఈశ్వర్ పెంటి నటించారు.
రచన, దర్శకత్వం: యష్ రాజ్
నిర్మాత: బీఎన్ రవి
కో-డైరెక్టర్: సంతోష్ పెంట
సంగీతం: విశ్వదీప్
సినిమాటోగ్రఫీ: యూఎస్ విజయ్
ఎడిటర్: హరి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అశోక్ మాకిరెడ్డి, రవితేజ ఆర్ల
ప్రొడక్షన్ కంట్రోలర్: రూపేష్ చౌదరి గొల్ల
కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి
సౌండ్ డిజైనింగ్, రీ-రికార్డింగ్ మిక్సింగ్: శ్యామల్ సిక్డర్
కలరిస్ట్: భూసం కిరణ్ కుమార్



