ధృవ్ విక్రమ్, రమేష్ వర్మ కాంబోలో హై ఇంటెన్స్ తమిళ్, తెలుగు ద్విభాషా చిత్రం

0
7
Dhruv Vikram And Ramesh Varma Come Together For A Tamil – Telugu Bilingual Action Film
Dhruv Vikram And Ramesh Varma Come Together For A Tamil – Telugu Bilingual Action Film

పెన్ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్‌వి స్టూడియోస్ బ్యానర్‌లో ధృవ్ విక్రమ్, రమేష్ వర్మ కాంబోలో హై ఇంటెన్స్ తమిళ్, తెలుగు ద్విభాషా చిత్రం.. సెప్టెంబర్ 23న టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

ధృవ్ విక్రమ్ హీరోగా పెన్ జయంతిలాల్ సమర్పణలో పెన్ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్‌వి స్టూడియోస్ బ్యానర్‌లో రమేష్ వర్మ నూతన చిత్రాన్ని ప్రకటించారు. హై ఆక్టేన్ యాక్షనర్, ఎమోషన్, డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటనను తాజాగా చేశారు. పూజా కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున నిర్వహించారు. అక్టోబర్‌లో నూతన షెడ్యూల్‌ని కూడా ప్రారంభించనున్నారు. ధృవ్ విక్రమ్ బర్త్ డే (సెప్టెంబర్ 23) సందర్భంగా అప్డేట్ రాబోతోన్నట్టుగా తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్, పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లు విడుదల చేయనున్నారు. హై ఇంటెన్సిటీ యాక్షన్ సాగాని ప్రపంచానికి పరిచయం చేయబోతోన్నారు. అక్టోబర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతోన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళ, తెలుగు ప్రేక్షకుల కోసం గ్రాండియర్, ఎమోషనల్, ఇంటెన్స్, ఆకట్టుకునే కథనం కలగలిపి, దృశ్యపరంగా శక్తివంతమైన, ఉత్కంఠభరితమైన యాక్షన్ అనుభవాన్ని అందించేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారు.

నటీనటులు : ధృవ్ విక్రమ్ తదితరులు

సమర్పణ : పెన్ జయంతిలాల్
బ్యానర్లు :పెన్ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్‌వి స్టూడియోస్ ప్రొడక్షన్
నిర్మాతలు :కోనేరు సత్య నారాయణ, శిరీష కూరపాట
దర్శకుడు : రమేష్ వర్మ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here