‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో సూపర్ ‘హిట్’ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి

0
42

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో సూపర్ ‘హిట్’ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి

టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ & ట్యాలెంటెడ్ ఆర్టిస్టుల్లో శ్రీనాథ్ మాగంటి పేరు తప్పకుండా వినిపిస్తుంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో అభిలాష్ పాత్రలో ఆయన నటన పలు ప్రశంసలు అందుకుంది. ‘లక్కీ భాస్కర్’లోనూ సూరజ్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ‘యానిమల్’తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. ఆ సినిమాలో రష్మిక బ్రదర్ రోల్ చేశారు. ఇప్పుడు శ్రీనాథ్ మాగంటి క్రేజీ ప్రాజెక్టులో హీరోగా నటించనున్నారు. 

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన కల్ట్ ఫిల్మ్ ‘ఈ నగరానికి ఏమైంది’. ఆ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. నలుగురు స్నేహితుల చుట్టూ నడిచే కథతో ‘ఈ నగరానికి ఏమైంది’ తీశారు తరుణ్ భాస్కర్. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, స్నేహం నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు. ‘ఈ నగరానికి ఏమైంది 2’ స్క్రిప్ట్ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రాశారు. అందులో శ్రీనాథ్ మాగంటి ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. హీరోల్లో ఆయన కూడా ఒకరు.

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో కార్తీక్ పాత్ర పోషించిన సుశాంత్, ‘ఈ నగరానికి ఏమైంది 2’లో నటించడం లేదని తరుణ్ భాస్కర్ తెలిపారు. సుశాంత్ లేకపోయినా కార్తీక్ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు ఆ రోల్ శ్రీనాథ్ మాగంటి చేస్తున్నారా? వెయిట్ అండ్ సి. తరుణ్ భాస్కర్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేయాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here