‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేయడం నాకు క్యూట్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిచ్చింది – మెగాస్టార్‌ చిరంజీవి

0
478

గత కొన్ని సంవత్సరాలుగా ‘మా’ టివి ప్రేక్షకులు మెచ్చే సీరియల్స్‌తో, గేమ్‌ షోస్‌తో దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ స్థాయిలో గొప్ప పేరు వున్న స్టార్‌ టివి.. మా టివిని బిజినెస్‌ పార్టనర్‌ చేసుకుంది. ఫిబ్రవరి 13 రాత్రి 9.30 నిముషాలకు మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో ప్రారంభమయ్యే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో ‘మా’ టివి ‘స్టార్‌ మా’గా అవతరించబోతోంది. ఈ రెండు ఛానల్స్‌కి సంబంధించిన కొత్త లోగో ఆవిష్కరణ ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లోని పార్క్‌హయాత్‌ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, సౌత్‌ స్టార్‌ ఇండియా సి.ఇ.ఓ. కెవిన్‌ వాస్‌, బిజినెస్‌ మేనేజర్‌ అలోక్‌జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ – ”ఈ పది సంవత్సరాలు సినిమాకి, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీల్డ్‌కి దూరంగా వున్న మాట వాస్తవం. ఈ సమయంలో మళ్ళీ సినిమా చెయ్యాల్సిన పరిస్థితులు వచ్చినపుడు ఆడియన్స్‌ రియాక్షన్‌ ఎలా వుంటుంది? నన్ను ఏ రకంగా మళ్ళీ రిసీవ్‌ చేసుకుంటారు? గతంలో నాపై వున్న ప్రేమ, అభిమానం అలాగే వుంటుందా? అనే డౌటు నాకు లేకపోలేదు. కానీ, అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఖైదీ నంబర్‌ 150 సినిమాని ప్రేక్షకులు ఆదరించిన విధానం, వాళ్ళు నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయత నిజంగా జీవితంలో మర్చిపోలేను. ఏదో సినిమాలో నేనే అన్నాను.. తెలుగు ప్రేక్షులు సెంటిమెంటల్‌ ఫూల్స్‌ అని. ఎందుకంటే ఒకసారి ప్రేమించడం మొదలుపెడితే జీవితాంతం ప్రేమిస్తూనే వుంటారు. దానికి నిదర్శనమే ఈ సినిమాని ఆదరించి నన్ను అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా జీవితం ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. ఈ సినిమా అయిపోయింది. పెద్ద ఘనవిజయం సాధించింది, ఇక ఏమిటి అనుకుంటున్న తరుణంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది. ఈ షో చేయడం నాకు క్యూట్‌ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ నేను టి.వి. వ్యాఖ్యాతగా కానీ, గేమ్‌ షోస్‌ నిర్వహించింది లేదు. ఈ షో చేస్తున్నప్పుడు రకరకాల వ్యక్తుల్ని కలుసుకునే అవకాశం కలిగింది. మేధావులు దగ్గర నుంచి రోడ్లు ఊడ్చే వారు, ఆటో డ్రైవర్స్‌, బ్యాంక్‌లో పనిచేసేవారు.. ఇలా రకరకాల ఆర్థిక స్థాయిలో వున్న వారిని కలుసుకొని వారితో సంభాషిస్తుంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌ అంతా ఇంతా కాదు. ఎం.ఇ.కె. అనేది ఎమోషనల్‌ జర్నీ. అలాంటి అవకాశం ‘మా’ ద్వారా రావడం చాలా సంతోషంగా వుంది. ఇంతవరకు ‘మా’.. ఫిబ్రవరి 13 రాత్రి 9.30 నిముషాల నుంచి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో ‘స్టార్‌ మా’ లోగో నాతో ఆవిష్కరింపజేయడం, దానికి ముందు ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం చాలా సంతోషంగా వుంది. ఇది చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.

సౌత్‌ స్టార్‌ ఇండియా సి.ఇ.ఓ కెవిన్‌ వాస్‌ మాట్లాడుతూ – ”ఇది మాకు చాలా ఎక్సైటింగ్‌ డే. రెండు సంవత్సరాల క్రితం మొదలైన స్టార్‌, మా ఫోర్‌ జనరేషన్‌ షిప్‌ బాగా డెవలప్‌ అయి ఒక షేప్‌కి వచ్చింది. బిగ్గెస్ట్‌ షోలు, సినిమాలు, ఈవెంట్స్‌తో మా టివి నెంబర్‌ వన్‌ ఛానల్‌ అయింది. కుంకుమపువ్వు నెంబర్‌ వన్‌ సీరియల్‌ అయింది. బాహుబలి, జనతా గ్యారేజ్‌ మాటివిలో టెలికాస్ట్‌ అయిన బిగ్గెస్ట్‌ మూవీస్‌. ఇప్పుడు స్టార్‌ మాగా అవతరించిన మా టివి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ప్రేక్షకుల్ని ఇన్‌స్పైర్‌ చెయ్యబోతోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్ళబోతోంది” అన్నారు.

అలోక్‌ జైన్‌ మాట్లాడుతూ – ”మా టివికి ఎమేజింగ్‌ బ్రాండింగ్‌ ఈక్విటీ వుంది. కొత్త ఈవెంట్స్‌తో, కొత్త షోలతో మాటివి లీడింగ్‌ పొజిషన్‌లో వుంది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో వున్న తెలుగు వారు, డిఫరెంట్‌ కంట్రీస్‌లో వున్న తెలుగు వారికి మా టివి ఎంతో దగ్గరైంది. ‘మా’ మనందరి టి.వి. ఇప్పుడు ‘స్టార్‌ మా’గా అదే బంధం సరికొత్త ఉత్తేజంతో మీ ముందుకు వస్తోంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here