‘విన్నర్‌’ సాయిధరమ్‌ తేజ్‌కి స్టార్‌డమ్‌ని తెచ్చే సినిమా అవుతుంది – సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌

0
335

యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విన్నర్‌’. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్‌ తేజ్‌, కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్‌, సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె.నాయుడు, ఎడిటర్‌ గౌతంరాజు, నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు, దర్శకుడు గోపీచంద్‌ మలినేని, డిస్ట్రిబ్యూటర్‌ సునీల్‌ నారంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ – ”ట్రైలర్‌ చాలా బాగుంది. ఇది నా ప్రొడక్షన్‌, నా కెమెరామెన్‌, నా రైటర్‌.. ఇలా అందరూ నా వాళ్ళు చేసిన సినిమా కావడం వల్ల ఇది నా సినిమాగా ఫీల్‌ అవుతున్నాను. సాయిధరమ్‌ తేజ్‌ చాలా ఫెంటాస్టిక్‌గా చేశాడు. హార్స్‌ రైడింగ్‌ అతను చేసిన విధానం చాలా బాగుంది. మా నిర్మాతలు ఎంతో ఖర్చుపెట్టి ఈ సినిమా చేశారు. గోపీచంద్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీశాడు. ఛోటా కె.నాయుడు మాతృదేవోభవ చిత్రానికి ఎలాంటి ఫోటోగ్రఫీ అందించాడో అప్పటి నుంచి క్వాలిటీని పెంచుకుంటూ ఎంతో అద్భుతంగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇది బాపుగారి సినిమా, ఇది విశ్వనాథ్‌గారి సినిమా అని ఎలా చెప్పుకుంటామో, సినిమాటోగ్రాఫర్స్‌లో ఇది జీవా సినిమా, ఇది సంతోష్‌ శివన్‌ సినిమా, ఇది పి.సి.శ్రీరామ్‌ సినిమా అని కూడా చెప్పుకుంటాం. అలా ఇది ఛోటా కె.నాయుడు చేసిన సినిమా అని చెప్పుకునే స్థాయికి వచ్చిన ఏకైక కెమెరామన్‌ ఛోటా కె.నాయుడు. ఇది హార్స్‌రేస్‌కి సంబంధించిన కథాంశం కావడంతో బడ్జెట్‌కి ఎక్కడా వెనుకాడకుండా మా నిర్మాతలు టర్కీ వరకు వెళ్ళి చాలా రిచ్‌గా తీశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తేజుకి స్టార్‌డమ్‌ తెచ్చే సినిమా అవుతుంది. గోపీకి ఈ సినిమా డెఫినెట్‌గా సూపర్‌హిట్‌ అవుతుంది. మా నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాల్ని తెచ్చిపెడుతుంది” అన్నారు.

దర్శకుడు గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ – ”ఇది నాకు చాలా మంచి అవకాశం. మా హీరో సాయి క్యారెక్టర్‌కి తగ్గట్టు ఎలా మౌల్డ్‌ కావాలో అలా మౌల్డ్‌ అవుతూ సినిమా బాగా రావడానికి కారణం అయ్యాడు. నేను ఛోటాగారితో ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాను. అది ఈ సినిమాతో నెరవేరినందుకు చాలా సంతోషంగా వుంది. ఈ సినిమా హండ్రెడ్‌ పర్సెంట్‌ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ఫిబ్రవరి 24న మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ అవుతోంది. వెలిగొండ మంచి కథ ఇచ్చారు. థమన్‌ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ చేశాడు. ఛోటాగారు విజువల్‌గా చాలా గ్రాండియర్‌గా ఈ సినిమా చేశారు. ఇలా నాకు చాలా మంచి టీమ్‌ దొరికింది. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుంది” అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ – ”ఈ కథ విన్న తర్వాత కొత్త లొకేషన్స్‌ అయితే బాగుంటుంది అనుకున్నాము. దానికోసం దుబాయ్‌, సౌత్‌ ఆఫ్రికా.. ఇలా చాలా లొకేషన్స్‌ చూశాం. చివరికి టర్కీ అయితే సబ్జెక్ట్‌కి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని ఫైనల్‌ చేశాం. అనుకున్నట్టుగానే చాలా బాగా వచ్చింది. షూటింగ్‌ సాయి హార్స్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడల్లా నాకు టెన్షన్‌ మొదలయ్యేది. ఎందుకంటే గుర్రంతో వర్క్‌ చేయడం అనేది చాలా కష్టం. ఆ టెన్షన్‌వల్లే షూటింగ్‌ని ఎక్కువగా ఎంజాయ్‌ చెయ్యలేకపోయాను. కానీ, సాయి చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. మా డైరెక్టర్‌ గోపీ చాలా మొండోడు. తనకు కావాల్సిన విధంగా వచ్చే వరకు ఏదీ ఒప్పుకోడు. హండ్రెడ్‌ పర్సెంట్‌ రిజల్ట్‌ వచ్చేవరకు తీసేవాడు. ఇంత మంచి టీమ్‌తో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది” అన్నారు.

వెలిగొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ”డాన్‌శీను నుండి గోపీచంద్‌తో పనిచేస్తున్నాను. మేం చేసిన ప్రతి సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేస్తున్న ఈ సినిమా కూడా హండ్రెడ్‌ పర్సెంట్‌ సూపర్‌హిట్‌ అవుతుంది. ఈ సినిమా కోసం తేజు చాలా కష్టపడ్డాడు. తన కష్టం ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. ట్రైలర్‌ చాలా బాగుంది. ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు మా నిర్మాతలు. వినాయక్‌గారు నిర్మాతలకు లాభాలు రావాలని ప్రతి ప్రతి ప్రెస్‌మీట్‌లో చెప్తుంటారు. ఒక మంచి సినిమా తియ్యడం కోసం బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా ఈ సినిమాని తీసిన మా నిర్మాతలకు మంచి లాభాలు రావాలని, సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ – ”చాలా మంచి కథ, మంచి డైరెక్టర్‌, మంచి సినిమాటోగ్రాఫర్‌.. ఇలా అందరూ ఈ సినిమాకి మంచి టెక్నీషియన్స్‌ పనిచేశారు. ఈ సినిమాలో జగపతిబాబుగారితో నా అసోసియేషన్‌ ఎక్కువగా వుంటుంది. మా డైరెక్టర్‌ గోపీచంద్‌గారు ఈ సినిమాలో నన్ను బాగా కంట్రోల్‌ చేశారు. నేను చాలా స్పీడ్‌గా మాట్లాడతాను. దాన్ని తగ్గించి మామూలుగా మాట్లాడడం ద్వారా నా క్యారెక్టర్‌ని ఇంకా హైలైట్‌ చేశారు. రకుల్‌ ప్రీత్‌ చాలా బాగా చేసింది. థమన్‌ చాలా మంచి పాటలు చేశాడు. గౌతంరాజుగారు సినిమా అద్భుతంగా ఎడిట్‌ చేశారు. ఆయనతో నేను చేసిన ఐదో సినిమా ఇది. మా నిర్మాతలు బుజ్జిగారు, మధుగారు సినిమాని చాలా రిచ్‌గా తీశారు. ఒక కొత్త బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాని తప్పకుండా మీ అందరూ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు” అన్నారు.

నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు మాట్లాడుతూ – ”రేస్‌ కోర్స్‌పై తెలుగులో చేస్తున్న ఫస్ట్‌ మూవీ ఇది. కొత్త కాన్సెప్ట్‌, కొత్త బ్యాక్‌డ్రాప్‌ కావడం వల్ల ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. సాయిధరమ్‌ చాలా అద్భుతంగా తన క్యారెక్టర్‌ని చేశాడు. డైరెక్టర్‌ గోపీ మేం అనుకున్న దానికంటే బాగా తీశాడు. దానికి ఛోటా కె.నాయుడు సపోర్ట్‌ కూడా ఎంతో వుంది. ఒక మంచి సినిమా చేశాం. తప్పకుండా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

సాయిధరమ్‌తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, ఆలీ, పృథ్వీ, వెన్నెల కిశోర్‌, సురేష్‌, ముఖేష్‌ రుషి, ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌, సోనియా అగర్వాల్‌, కళ్యాణి, అనసూయ, సూర్య, రఘుబాబు, మాస్టర్‌ చరిత్‌, ప్రియ, కారుమంచి రఘు, ఆదర్శ్‌, దువ్వాసి మోహన్‌, వేణు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్‌: గౌతంరాజు, కథ: వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: అబ్బూరి రవి, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్‌, అనంతశ్రీరామ్‌, శ్రీమణి, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఫైట్స్‌: కనల్‌ కణ్ణన్‌, స్టన్‌శివ, రవివర్మ, డ్రాగన్‌ ప్రకాష్‌, ఛీఫ్‌ కో-డైరెక్టర్‌: జె.వి.వి.సత్యనారాయణమూర్తి, సమర్పణ: బేబీ భవ్య, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here