విశాల్‌పై నిషేధం ఎత్తేసిన త‌మిళ నిర్మాత‌ల మండ‌లి

0
392

సౌత్ సెన్సేష‌నల్‌ హీరో విశాల్‌పై తమిళ నిర్మాతల మండలి విధించిన సస్పెన్షన్‌ తొలగిపోయింది. ఈ విషయంలో మద్రాస్‌ హైకోర్టు జోక్యం చేసుకుని స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించింది. తమిళ నిర్మాతల మండలితో వివాదంపై తీర్పును వెలువ‌రించింది.

మండ‌లి తీరుతెన్నుల్ని విశాల్ ప్ర‌శ్నించినందుకు, విమ‌ర్శించినందుకు అత‌డిపై నిషేధం విధించారు. త‌న వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా నిర్మాత‌ల మండ‌లి కార్య‌వ‌ర్గం కోరుతూ తాత్కాలిక వేటు వేసింది. దీనిపై విశాల్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించి, తనకు న్యాయం జరగాలని పిటిషన్‌ వేశారు. హైకోర్టు జోక్యం చేసుకుని స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగేలా చేసిందిప్పుడు. 2013 నుంచి విశాల్ ఫిలింఫ్యాక్ట‌రీ ప‌తాకంపై సినిమాలు నిర్మిస్తూ ప‌లు విజ‌యాల్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు హీరోగానూ అటు తమిళ్‌, ఇటు తెలుగులో చ‌క్క‌ని విజ‌యాల్ని అందుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here