తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ హీరో, సూపర్ స్టార్ కృష్ణ

0
387

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ ద్వార తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారు ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు నానక్ రామ్ గూడా లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ హీరో, సూపర్ స్టార్ కృష్ణ.

ఈ సందర్భంగా హీరో కృష్ణ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి పై బాధ్యత ఉందని అన్నారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో పచ్చదనం పెంచడం కోసం చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని అతను చేస్తున్న కృషికి నేను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది తెలిపారు.

నా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here