తారక్, నా ఛాలెంజ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాను: విక్టరీ వెంకటేష్…..!!

0
933
Victory venkatesh completed successfully Betherealman Challenge

ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి పనుల్లో ఆడవారికి సాయపడాలనే ఉద్దేశ్యంతో మొదలైన ‘బి ద రియల్ మ్యాన్‘ ఛాలెంజ్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులు ఒకరి తరువాత మరొకరికి చేరుతూ ముందుకు సాగుతోంది. కాగా ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్వారా విక్టరీ వెంకటేష్ వరకు చేరగా, నేడు ఆయన తన ఇంటిని శుభ్రం చేస్తూ, లాన్ లో గడ్డిని, మొక్కలను కట్ చేస్తూ, అలానే వంట చేస్తూ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసారు.

తారక్ నా ఛాలెంజ్ ని పూర్తి చేశాను అంటూ తన వీడియోని పోస్ట్ చేసిన వెంకటేష్, తదుపరి ఆ ఛాలెంజ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి లకు విసిరారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here