మొదట్లో కొంత కష్టంగా ఉన్నా, తరువాత అలవాటై సరదా అయింది : కొరటాల శివ…..!!

0
741
Director Koratala Siva Nominated Vijay Devarakonda

కొద్దిరోజుల క్రితం అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రారంభించిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ మెల్లగా ఒకరి నుండి మరొకరికి చేరుతూ మంచి పాపులర్ అవుతోంది. కాగా నిన్న తనకు దర్శకుడు రాజమౌళి విసిరిన ఛాలెంజ్ ని పూర్తి చేసిన ఎన్టీఆర్, దానిని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు దర్శకుడు కొరటాల శివ కు ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే.

కాగా నేడు ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని సక్సెస్ఫుల్ గా తన ఇంటి పనులు చేస్తూ పూర్తి చేసిన దర్శకుడు కొరటాల శివ, మీరు ఇచ్చిన ఛాలెంజ్ ని పూర్తి చేశాను అన్నయ్య, మొదట్లో కొంత కష్టంగా ఉన్నా, తరువాత అలవాటై సరదాగా అయింది అంటూ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తాను చేసిన పనుల తాలూకు వీడియో బైట్ ని పోస్ట్ చేసారు. అనంతరం అదే ఛాలెంజ్ ని రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఆయన విసరడం జరిగింది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here