ఖైదీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

0
1356

యాంగ్రీ హీరో కార్తీ మరోసారి డిఫరెంట్ రోల్ తో ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంటున్నాడు. ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉండేలా మంచి కథలను ఎందుకుంటున్న ఈ స్టార్ హీరో మరో డిఫరెంట్ జానర్ లో సక్సెస్ అందుకున్నాడు. సాంగ్స్ – రొమాన్స్ లేకుండా యక్షన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఖైదీ సినిమా మొదటిరోజే పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీపావళి సందర్భంగా శుక్రవారం తెలుగు తమిళ్ లో ఒకేసారి విడుదలైన ఖైదీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది.

ఇక సినిమాకు సీక్వెల్ చేయడానికి కూడా రెడీ అని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఖైదీ సీక్వెల్ గురించి ఇటీవల రూమర్స్ చాలానే వచ్చాయి. కార్తీ కూడా ఓ కామెంట్ వేశాడు. ఈ విషయంపై ఓ వర్గం నుంచి గ్యాప్ లేకుండా సందేహాలు ఎదుర్కొన్న లోకేష్ ఎట్టకేలకు స్పందించాడు. సినిమాకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోందని తప్పకుండా ఢిల్లీ (ఖైదీలో కార్తీ పాత్ర) మళ్ళీ రాబోతున్నాట్లు వివరణ ఇచ్చాడు. నెక్స్ట్ డైరెక్టర్ లోకేష్ విజయ్ 64వ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ ప్రాజెక్ట్ మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. విజయ్ తో సినిమా చేసిన అనంతరం కార్తీ ఖైది 2 తెరకెక్కే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here