NBK 105 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్…..!!

0
688

నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన ‘జైసింహా’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయనతో కలిసి మరొక సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. NBK 105 వ సినిమాగా తెరెక్కుతున్న ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం గం.2 ని.50 లకు రిలీజ్ చేయబోతున్నట్లు ఆ సినిమా నిర్మాతలైన హ్యాపీ మూవీస్ వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది.

సి కళ్యాణ్ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తుండగా, భూమిక ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని బాలకృష్ణ స్టైలిష్ లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. కాగా ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here