ఈ రోజుల్లో చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు దర్శకుడు మారుతి. తరువాత అనతి కాలంలోనే ‘బస్టాప్’, ‘కొత్తజంట’, ‘భలే భలే మొగాడివోయ్’, ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’,’ శైలజారెడ్డి రెడ్డి అల్లుడు’ లాంటి కమర్షియల్ విజయాలతో హ్యాట్రిక్ డైరెక్టర్ గా, అభిరుచి గల నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌తేజ్ రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా ‘ప్రతిరోజు పండగే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అక్టోబర్ 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ..
‘ఈరోజుల్లో’ సినిమాతో మీ ప్రయాణం మొదలైంది కదా ఈ జర్నీ అంతా చూస్తుంటే ఎలా అనిపిస్తోంది?
– ఈ రూట్లో వెళ్తాను అని నేనుప్పుడూ అనుకోలేదు. నేను డైరెక్టర్ అవ్వాలి అనే కోరిక ‘ఈరోజుల్లో’ చిత్రం తీర్చింది. ఆ తరువాత నాదగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్నిప్రాపర్గా ఉపయోగించుకుంటూ వచ్చాను. నేను ఒక సినిమా డైరెక్ట్ చెయ్యగలని ఫ్రెండ్స్‌కు చూపించడానికి ‘ఈరోజుల్లో’ తీశాను. అది పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా మంది నిర్మాతలు సినిమాలు చెయ్యమని అడిగారు, అలా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను.
‘ప్రతిరోజు పండగే’ కథను ముందు అరవింద్ గారికే చెప్పారా?
-‘ ప్రతిరోజు పండగే’ కథను ముందు యు.వి.క్రియేషన్స్ వంశీ గారికి చెప్పాను. వంశీ గారికి కథ బాగా నచ్చింది, ఈ సబ్జెక్ట్ డెవలప్ చేస్తున్న ప్రాసెస్‌లో అల్లు అరవింద్ గారికి డిటెయిల్డ్గా నరేట్ చేశాను. సింగిల్ సిట్టింగ్‌లో అరవింద్ గారికి, బన్నీ వాసు గారికి కథ బాగా నచ్చింది. అలా గీత ఆర్ట్స్2లో ఈ చిత్రాన్ని ప్రారంభించాము.
ఈ ప్రాజెక్ట్‌లోకి సాయిధరమ్‌తేజ్ ఎలా ఎంటర్ అయ్యారు?
– అరవింద్ గారికి కథ నచ్చగానే ఈ స్టోరీని చిరంజీవి గారికి వినిపించడం జరిగింది. నేను గతంలో కూడా ‘భలే భలే మొగాడివోయ్’ స్క్రిప్ట్‌ను చిరంజీవి గారికి వినిపించాను. ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు . దాని తర్వాత లక్కీగా ఈ కథను ఆయనకు చెప్పే అవకాశం దక్కింది. వన్ అవర్ టైమ్ ఇచ్చి కథ నచ్చడంతో మూడు గంటలపాటు పూర్తి కథ విని నీకున్న స్ట్రెంగ్త్ ఫన్ దాన్నివదలకుండా ఈ సినిమా చేయి అని చెప్పారు. అలా వెళ్లి సాయికి ఈ కథ చెప్పాను. సాయి కూడా చాలా ఎగ్జైట్ అయ్యి ఓకే చెప్పారు.
ప్రతి రోజు పండగే సినిమా ఎలా ఉండబోతుంది?
– ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలను తీసుకొని నా తరహాలో దానికి ఎంటర్టైన్మెంట్ను జోడించి సినిమాలు తీశాను, సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం చేస్తున్న ప్రతిరోజు పండగేలో ఎమోషన్స్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సాయి కెరీర్లో ఇది డిఫరెంట్ సినిమా. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరూ ఎదో ఒక చోట 100 పర్సెంట్ కనెక్ట్ అవుతారు.
మొదటి ప్రచార చిత్రానికే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది కదా! స్టోరీ లైన్ ఏంటో చెప్తారా?
-మనిషి పుట్టినప్పుడు సంతోషంగా సెలెబ్రెట్ చేసుకుంటారు. కానీ మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతన్ని మానసికంగా సంతోషపెడితే మరిన్ని ఎక్కువ రోజులు బ్రతుకుతాడానే విషయాన్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పాము. ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే చాలా అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి.
అంటే మోడ్రన్ ‘తాత మనవడు’ సినిమాలా ఉంటుందా?
-‘అసలు తాత మనవడు’ సినిమాకు ఈ సినిమాకు సంబంధం ఉండదు. ఎందుకంటే గతంలో ‘తాత మనవడు, ఇంటింటి బాగోతం’ ఇలా ఫ్యామిలీ కథలు చాలా వచ్చాయి. కానీ చావును సెలెబ్రేట్ చేసుకోవడం అనే సబ్జెక్ట్‌ను ఎవ్వరూ టచ్ చేయలేదు. దాన్ని ఈ సినిమాలో చూస్తారు.
ప్రతిరోజు పండగే షూటింగ్ వివరాలు ?
– ప్రతిరోజు పండగే ఎనభై శాతం చిత్రీకరణ పూర్తి అయింది. అమెరికాలో ఐదు రోజులు షూట్ చెయ్యాలి. ఈ సినిమా కథ ఎక్కడ డిమాండ్ చేస్తే అక్కడకి ఎక్కడా రాజీ పడకుండా నా సినిమాను ఫస్ట్ టైమ్ రియల్ లొకేషన్స్‌లో షూట్ చేస్తున్నాము. సినిమా ఔట్ఫుట్తో మేము హ్యాపీగా ఉన్నాము. డిసెంబర్ రెండో వారంలో ఫస్ట్ కాపీ సిద్ధం అవుతుంది. విడుదల తేదీని నిర్మాతలు అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు ప్రకటిస్తారు.
పల్లెటూరి నేపథ్యంలోనే ఉంటుందా ?
– ప్రతిరోజు పండగే సినిమాను రాజమండ్రిలో కొన్ని రోజులు షూట్ చేశాం. ప్రక తికి దగ్గరగా ఉన్న ఈ కథ కోసం పచ్చని పొలాల్లో కీలక సన్నివేషాలు చిత్రీకరించడం జరిగింది.
ఈ సినిమాలో మ్యూజిక్ గురించి ?
– సినిమాలు ఐదు పాటలు ఉన్నాయి. అన్ని స్టోరీ టెల్లింగ్ సాంగ్స్. థమన్ మంచి సంగీతం ఇచ్చాడు. ముఖ్యంగా మెలోడీస్ చాలా బాగున్నాయి. సత్యరాజ్, రాశి కన్నాగారి నటన సినిమాకు ఆదనవు ఆకర్షణ కానుంది.
ఈ రోజుల్లో టైమ్‌లో చిన్న సినిమా ఎలా ఉంది ? ఇప్పుడు ఎలా ఉంది?
– ఏ రోజుల్లో అయినా కథను డేడికేటెడ్గా గ్రిప్పింగ్‌గా చెప్పగలిగితే తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది. చిన్న సినిమాకు ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఏమి లేని చోటుకి ఆడియన్స్‌ని రాబట్టుకోవాలి. అయితే ప్రస్తతం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా’ విజయాలతో చిన్న సినిమా స్థాయి పూర్తిగా మారిపోయింది. గతంలో చిన్న సినిమా తీస్తే అది థియేటర్లో ఆడితేనే డబ్బులు వచ్చేవి కానీ ఇప్పడు 50-60% డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ద్వారానే వస్తున్నాయి. కాబట్టి మంచి సినిమాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది.
పుట్టిన రోజుని ఎలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు?
– ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ప్రతి రోజు పండగే.. చాలా రోజుల తర్వాత నేను ఒక సబ్జెక్ట్‌ని, ఒక సినిమాను ఎంజాయ్ చేస్తూ చేస్తుంది ఈ సినిమాకే. ఎందుకంటే ఈ సినిమాలో దాదాపు 20 మంది ఆర్టిస్టులు ప్రతి రోజు సెట్లో ఉంటారు. ప్రతి సీన్‌కి అందరు కనెక్ట్ అయ్యి వారు వారు మాట్లాడుకొనిప్రతి డైలాగ్ ఎంజాయ్ చేస్తూ చేస్తున్న సినిమా ఇది. అందుకనే ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా అనుకున్నది అనుకున్నట్లుగా షూటింగ్ కంప్లీట్ చేసిన సినిమా ఇదే. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.


