తండ్రి సినిమాలో మొదటిసారి జాన్వీ

0
677

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఆఫర్స్ అందుకోవడంలో జెట్ స్పీడ్ లో వెళుతోంది. పోటీ ప్రపంచంలో గ్లామర్ తో పాటూ అక్కట్టుకునే నటనతో కూడా మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఇప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా డిఫరెంట్ ప్రాజెక్టులను కూడా ఒకే చేస్తోంది.

ఇక తండ్రి బోణి కపూర్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. గత కొంత కాలంగా నేషనల్ మీడియాలో వీరి కాంబినేషన్ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఫైనల్ గా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. తండ్రి ప్రొడక్షన్ లో మొదటి సారి జాన్వీ నటించబోతోంది.

రెబెల్ నేచర్ తో ఉండే ఒక టీనేజర్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఆ సినిమాకు బాంబే గర్ల్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహించనున్నాడు., ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా పూర్తి వివరాలను బోణి కపూర్ త్వరలోనే తెలియజేయనున్నారు. బోణి కపూర్ తో పాటు మహావీర్ జైన్ ఈ ప్రాజెక్ట్ కి సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here