టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీతో గడిపే సమయాన్ని మాత్రం అస్సలు మిస్సవ్వడు. ఇక షూటింగ్ కి ఇటీవల కాస్త గ్యాప్ ఇచ్చిన సూపర్ స్టార్ తనకు ఇష్టమైన ప్లేస్ కి ఫ్యామిలితో వెళ్ళాడు. స్విజర్ ల్యాండ్ లోని స్విస్ ఆల్ప్స్ లో ఫ్యామిలీతో దసరా హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు.
భూమిపై నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం !! స్విస్ ఆల్ప్స్-కుటుంబంతో చిన్న దసరా విరమాన్ని ఎంజాయ్ చేస్తున్నా అంటూ.. మళ్ళీ బ్యాటరీస్ ఫుల్ ఛార్జ్ అయినట్లు చమత్కరించారు. మహేష్ తీసిన సెల్ఫీలో భార్య నమ్రత – కొడుకు గౌతమ్ – కూతురు సితార ఉన్నారు. ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నికెవ్వరు సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.


