వరుణ్ తేజ్ న్యూ లుక్

0
793

టాలీవుడ్ లో ప్రస్తుతం డిఫరెంట్ గా నటిస్తూ హిట్స్ అందుకుంటున్న హీరోలో వరుణ్ తేజ్ ఒకరు. సెలెక్ట్ చేసుకున్న కథల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా కూడా తను నటించే పాత్రల్లో ఎదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. రీసెంట్ గా గద్దల కొండ గణేష్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ మెగా హీరో నిన్నటివరకు నిండు గెడ్డంతో కనిపించాడు.

ఇక ఫైనల్ గా వరుణ్ తేజ్ తన లుక్ లో మరో కొత్త చేంజ్ తీసుకొచ్చాడు. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ప్రొవోక్ పై స్టైలిష్ లుక్ తో దర్శనమిచ్చాడు. క్లీన్ షేవ్, సరికొత్త హెయిర్ స్టైల్ తో మెగా హీరో అమ్మాయిలను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. డ్రెస్సింగ్ స్టైల్ కూడా సూపర్బ్ గా ఉందని మెగా ఫ్యాన్స్ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం గద్దలకొండ గణేష్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న వరుణ్ త్వరలోనే నెక్స్ట్ సినిమాపై స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here