‘చమక్ చల్లో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచమై..ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, గౌతమ్ నందా జయజానకి నాయక వంటి చిత్రాలలో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు కేథరిన్. తాజాగా సిద్దార్ధ్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా సాయిశేఖర్ దర్శకత్వం లో పారిజాత మూవీ క్రియేషన్స్, ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై టి.అంజయ్య సమర్పిస్తున్న చిత్రం ‘వదలడు’. ఈ చిత్రం అక్టోబర్ 11 గ్రాండ్ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ కేథరిన్ మీడియా తో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..
వదలడు చిత్రంలో మీ పాత్ర గురించి చెప్పండి?
– ఈ చిత్రం లో నా పాత్ర పేరు జ్యోతి. ఆమె ఒక టీచర్. గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయిలా నా క్యారెక్టర్ ఉంటుంది., అయితే అందులో స్పెషల్ ఏంటంటే ఆ అమ్మాయికి పుట్టుకతోనే వాసనా జ్ఞానం ఉండదు. రెగ్యులర్ గా కాకుండా ఆ క్యారెక్టర్ కొత్తగా ఉండడం తో నేను ఆ క్యారెక్టర్ కి ఓకే చెప్పడం జరిగింది.
ఆ డిసీజ్ గురించి మీరేమైనా రీసర్చ్ చేశారా?
– చేశానండి. ఒక మనిషికి వాసనా పరిజ్ఞానం ఉండక పోవటాన్ని అనాస్మియా అంటారు. ప్రస్తుతం సమాజంలో కూడా అలాంటి వారు చాలా మంది ఉన్నారు.
అరువం అంటే ఏమిటీ?
– అరువం అంటే తమిళంలో భౌతిక రూపం లేనిదని అర్థం.
ఈ సినిమా దేని గురించి?
– మా చిత్రం ప్రస్తుత సమాజంలో పెరిగిపోయిన ఆహార కల్తీ గురించి అని చెప్పవచ్చు. ప్రజలలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోతుంది. దానికి కారణం ఆహార కల్తీ ఎక్కువ కావడమే. దీనిని అదుపు చేయడానికి మన దేశంలో సరైన చట్టాలు లేవు. ఇలాంటి విషయాలన్నీ చర్చిస్తూనే అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ‘వదలడు’.
టీజర్, ట్రైలర్ చూస్తుంటే హారర్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి ?
– నిజానికి ఈ చిత్రం పూర్తి స్థాయి హారర్ మూవీ కాదు ఒక ప్రాపర్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా చూసి ఎవరు భయపడరు. మా సినిమా చిన్నపిల్లలతో కలిసి చూడదగ్గ క్లీన్ యూ సర్టిఫికెట్ మూవీ. కాకపోతే 30 పర్సెంట్ సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి.
ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారా?
– ఖచ్చితంగా…,ఎందుకంటే ఆహారం అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. అందుకే ఇది యూనివర్సల్ స్టోరీ. కాబట్టి ఏ,బి,సి అనే వర్గ భేదాలు లేకుండా అన్ని తరగతుల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్మకం ఉంది. అలాగే సమాజంలో జరిగే కల్తీ ని కూడా అరికట్టాలి.
హీరో సిద్దార్ద్ గురించి?
– సిద్ధార్ద్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. దేశంలో ఏసంఘటన జరిగినా సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ ఉంటారు. ఈ మూవీలో ఆయన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఆ క్యారెక్టర్ ఆయనకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. అందుకే ఆ పాత్రలో ఆయన జీవించగలిగారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరో అయ్యారు. అందుకనే ఆయనకు సినిమాపై నాలెడ్జ్ ఎక్కువ. ఆయనతో వర్క్ చేయడం గుడ్ ఎక్స్పీరియన్స్..
డైరెక్టర్ గురించి చెప్పండి?
– దర్శకుడు సాయి మాధవ్ గారికి ఇదే మొదటి చిత్రం. ఐతే ఎక్కడా కొత్త దర్శకుడనే భావన కలుగదు. ఆయన గతంలో కొన్ని ప్రముఖ తెలుగు మరియు తమిళ చిత్రాలకు రచయితగా, కో రైటర్ గా పనిచేశారు. నా పాత్ర నాకు చెప్పినది చెప్పినట్లుగా తెరకెక్కించారు.
మీ చిత్రానికి థమన్ సంగీతంసమకూర్చినట్లున్నారు?
– అవును మా చిత్రంలో రెండు పాటలే ఉంటాయి. కథ ప్రకారం ఆ రెండు పాటలు చాలు. ఇక థమన్ అందించిన ఆర్ ఆర్ అద్భుతం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలలో ఆయన బీజీఎమ్ సినిమాకే హైలెట్ గా ఉంటుంది.
తెలుగులో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గానే చేశారు?
– ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అని కాదండి స్క్రిప్ట్ లో మన పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏమిటీ, అన్నదే ముఖ్యం. సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే గా చేశాను. ఆ చిత్రంలో మిగతా పాత్రలకంటే నాకే ఎక్కువ పేరొచ్చింది.
వరల్డ్ ఫేమస్ లవ్ చిత్రంలో మీరు నటిస్తున్నట్లున్నారు?
– అవును! దర్శకుడు క్రాంతి మాధవ్ గారు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చారు. అది ఏమిటీ అనేది ఇప్పుడే చెప్పలేను.. కానీ ఆ క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం.
తెలుగు బాగా మాట్లాడుతున్నారు, మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పుకోవచ్చుగా?
– ఇప్పటికే నేను గౌతమ్ నంద, చమ్మక్ చల్లో చిత్రాల్లో సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నాను. అలాగని ప్రతి దర్శకుడితో నేనే డబ్బింగ్ చెవుతానని అడగలేను. కానీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి మాత్రం కచ్చితంగా ట్రై చేస్తాను.
మీ డ్రీమ్ రోల్ ఏంటి ?
– నాకు డ్రీం రోల్ అని ఏమి లేదు కానీ వైవిధ్యం ఉన్న అనేక పాత్రలు చేయాలి, ఏ పాత్రనైనా చేయగల వెర్సిటైల్ యాక్టర్ అనిపించుకోవాలి. అందుకే తెలుగులో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసినా తమిళంలో యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు చేస్తున్నాను. మద్రాస్ సినిమాలో నేను చేసిన పాత్ర ప్రత్యేకం, అలాగే ఇప్పుడు ఈ చిత్రంలోని పాత్ర కూడా. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే పాత్రలు చేయడమే నా డ్రీం రోల్.


