స్టార్ హీరోస్ రిలేషన్ పై కమెడియన్ కామెంట్

0
833

చాలా వరకు సినీ ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎంత జోరుగా సాగినా హీరోలందరు చాలా ఫ్రెండ్లిగా ఉంటారన్నది అందరికి తెలిసిన విషయమే. కోలీవుడ్ లో థలా అజిత్ – ఇళయథాలపతి విజయ్ ల మధ్య కూడా అలాంటి స్నేహ బంధమే ఉంటుందని స్టార్ కమెడియన్ యోగి బాబు చెబుతున్నారు.

దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరు హీరోల స్నేహ బంధాన్ని గురించి వివరించాడు. ఒకరి గురించి మరొకరు తనతో మాట్లాడతారని విజయ్ ఎల్లప్పుడూ అజిత్ ని ఇష్టపడే విధంగానే మాట్లాడుతాడాని అన్నారు. అలాగే విశ్వాసం షూటింగ్ సమయంలో అతని యాక్టింగ్ స్కిల్స్ గురించి చర్చలు జరిగేవాని చెప్పారు. ఇక అజిత్ కూడా విజయ్ ని చాలా ఇష్టపడతారని యోగి బాబు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్టార్ కమెడియన్ విజయ్ బిగిల్ సినిమాలో నటిస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీ అక్టోబర్ 27న రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here