కోలీవుడ్ టాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్ ఫ్యామిలీ నుంచి మరో యువకుడు కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే విక్రమ్ తనయుడు ధృవ్ ని ఆదిత్య వర్మ సినిమాతో రెడీ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన ఆ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఇప్పుడు తన సోదరి తనయుడైన మేనల్లుడు అర్జుమాన్ ని హీరోగా కోలీవుడ్ కి పరిచయం చేయడానికి విక్రమ్ రెడీ అవుతున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా అర్జుమాన్ మొదటి సినిమాను కొన్ని నెలల క్రితమే మొదలుపెట్టారు. సినిమాకు PUBG (పొల్లదా ఉలగిల్ బయనగర గేమ్) అనే టైటిల్ ని కూడా సెట్ చేశారు. బిగ్ బాస్ ఫెమ్ ఐశ్వర్య దత్త హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై త్వరలోనే విక్రమ్ నుంచి స్పెషల్ ఎనౌన్మెంట్ వెలువడనుంది.


