బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. మిషిన్ మంగళ్ సినిమాతో మరోసారి 150కోట్ల కలెక్షన్స్ అందుకొని హ్యాట్రిక్ కొట్టాడు. గత ఏడాది నుంచి ఎవరు సాధించని విధంగా సరికొత్త రికార్డులు అందుకున్నాడు. రీసెంట్ గా ఫోర్బ్స్ విడుదల చేసిన రిచెస్ట్ యాక్టర్స్ లిస్ట్ అక్షయ్ నాలుగవ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే గత ఏడాది నుంచి అక్షయ్ నటించిన సినిమాల కలెక్షన్స్ ని గమానిస్తే అత్యధిక వేగంగా 150కోట్ల కలెక్షన్స్ అందుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించిన 2.ఓ సినిమాకు 150కోట్ల కలెక్షన్స్ అందుకోవడానికి 10రోజుల సమయం పట్టింది. ఇక కేసరి సినిమా 25రోజుల్లో ఆ రికార్డును అందుకోగా మిషిన్ మంగళ్ 11రోజుల్లో 150కోట్ల వసూళ్లను రాబట్టింది.