విడుదలకి సిద్ధమైన బాలీవుడ్ ప్రస్థానం

0
621

2010లో వచ్చిన టాలీవుడ్ ప్రస్థానం సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతోన్న సంగతి అందరికి తెలిసిందే. ఒరిజినల్ దర్శకుడు దేవాకట్ట హిందీ ప్రస్థానంకు దర్శకత్వం వహిస్తుండగా సంజయ్ దత్ సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తూ సినిమాలో నటిస్తున్నాడు. జూన్ 1న సింపుల్ గా మొదలైన సినిమా షూటింగ్ ఇప్పటికే కొన్ని షెడ్యుల్న్స్ ని పూర్తి చేసుకుంది. నేడు సినిమాకు సంబందించిన స్పెషల్ పోస్టర్ ని అధికారికంగా రిలీజ్ చేశారు.

సినిమాలో సంజయ్ గ్యాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. మనిషా కొయిరాల ఈ సినిమాలో సంజయ్ భార్యగా నటిస్తుండగా మరికొన్ని ముఖ్య పాత్రల్లో జాకీ ష్రాఫ్ – అలీ ఫైజల్ అమైరా దస్తూర్ – సత్యజిత్ దూబే వంటి ప్రముఖ స్టార్స్ నటిస్తున్నారు. దాదాపు పదేళ్ల తరువాత మనిషా కొయిరాల ఈ సినిమా ద్వారా సంజయ్ దత్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 20 న చిత్రం విడుదల కానుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here