త్వరలో చైనాకు సమంత ఓ బేబీ

0
506

అక్కినేని స‌మంత ప్రధాన పాత్రలో న‌టించిన ఓ బేబీ సినిమా సంచలనం విజయం సాధించిన సంగతి తెల్సిందే. జులై 5న విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను కూడా రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఓ బేబీ సినిమా 10 రోజుల్లో 1మిలియన్ వసూళ్లకు చేరువైంది.

సమంతా, డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు చైనా మార్కెట్ పై కన్నేసింది. చైనా అంతటా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. త్వరలోనే చైనాలో ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేస్తామని ఓ బేబీ సహ నిర్మాతలు వివేక్ కుచిభోట్ల, సునీతా తాతి వెల్లడించారు. ఇక, ఈ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేయడానికి కూడా భారీ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. బెంగాలీ, కన్నడతో పాటు ఇతర భారతీయ భాషల్లో డబ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీవ్రమైన పోటీ ఉందంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here