‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్

0
569

ఎనర్జిటిక్ హీరో రామ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తోన్న ఇస్మార్ట్ శంకర్ కి మంచి బజ్ ఉంది. హీరో దర్శకుడి కాంబినేషన్ క్రేజ్ తో పాటు మణి శర్మ సంగీతంలో వచ్చిన పాటలు హిట్ అవడం హీరోయిన్లు నిధి అగర్వాల్, నభ నటేష్ గ్లామర్ అంశాలు తోడవడంతో ఇస్మార్ట్ శంకర్ కోసం అన్ని వర్గాల నుండి ఎదురు చూపులు ఎక్కువయ్యాయి.

సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు అమితాసక్తిని చూపిస్తున్నారట. ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఊర మాస్ రీతిలో రూపొందించాడు పూరి. ట్రైలర్, సాంగ్స్ కూడా బాగుండటంతో ఈసారి పూరి హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు మంచి ధర చెల్లించి ఇస్మార్ట్ శంకర్‌ను కొనేశారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇస్మార్ట్ శంకర్ తెలుగు రాష్ట్రాల హక్కులు 13 కోట్లకు అమ్ముడుపోయాయట. అలాగే ఓవర్సీస్ హక్కులు, ఇతర రాష్ట్రాల హక్కులు, డిజిటల్ రైట్స్ ఇలా అన్నీ కలిపి మొత్తంగా 35 కోట్ల వరకు ప్రీ బిజినెస్ జరిగిందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here