ఊర్వశి.. ఊర్వశి.. పాటకు స్టెప్పులేసి సల్మాన్

0
558

ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..1994లో వచ్చిన తమిళ చిత్రం కాథలన్(తెలుగులో ప్రేమికుడు) చిత్రంలోని ఈ పాటకు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రహమాన్ తొలినాళ్లలో దర్శకుడు శంకర్ దర్శత్వంలో వచ్చిన ఈ పాట ఇప్పటికీ సుపరిచితమే. ఈ పాటలో ప్రభుదేవా వేసిన స్టెప్పులు ఇప్పటికీ ప్రత్యేకమే. రహమాన్ సంగీతంలో వచ్చిన ఉత్తమ డాన్స్ నంబర్స్ లలో ఇదీ ఒక్కటి. ఇప్పటికీ ఈ పాటకు యువత స్టెపులేస్తుంది. అయితే యువత మాత్రమే కాదు దిగ్గజ సెలెబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. కన్నడ నటుడు సుదీప్‌.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ న‌డియావాలా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాతో కొరియోగ్రఫీలో ఈ పాటకు స్టెప్పులేసారు. ఈ వీడియోను సల్మాన్ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసారు. ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫీలో స‌ల్మాన్‌, సుదీప్‌, సాజిద్ స్టెప్పులు వేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సుదీప్ విల‌న్ పాత్రలో నటిస్తున్నాడు. సాజిద్ న‌డియా వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దబాంగ్ 1,2 సిరీస్ లో హీరోయిన్ గా నటించిన సోనాక్షి సిన్హా ఇందులోనూ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సంవత్సరం చివారంతంలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here