గేయ రచయిత భాస్కరభట్లకు మాతృవియోగం

0
561

టాలీవుడ్ లో ప్రముఖ యువ పాటల రచయిత.. యువతను ఆకట్టుకునే లవ్ సాంగ్స్ ఎన్నో రాసిన భాస్కరభట్ల రవికుమార్. సినీ గేయ ర‌చ‌యిత‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్నారు. కాగా ఈరోజు భాస్కరభట్లకు మాతృవియోగం జరిగింది. భాస్క‌ర‌బ‌ట్ల త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మీ(67) తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆమెకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. కాగా వారిలో భాస్కరభట్ల రవికుమార్ పెద్ద కుమారుడు. సోమవారం అర్థ రాత్రి ఆమె మరణించగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగ‌ళ‌వారం ఉదయం ఆమె స్వగ్రామం ఇన్నీసుపేట కైలాసభూమిలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. భాస్కరభట్ల భార్య లలిత, ఇద్దరు పిల్లలు హుటాహుటిన స్వగ్రామానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, సాహితీ వేత్తలు విజ‌య‌ల‌క్ష్మీకి సంతాపం ప్ర‌క‌టించ‌గా, ఆమె కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here