యంగ్ హీరో నందు హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం సవారి. ఒక గుర్రం ప్రధాన పాత్రలో హీరో, హీరోయిన్ల మధ్య ఆకట్టుకునే రొమాంటిక్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో నందు సరసన ప్రియాంక హీరోయిన్ గా నటించగా, గతంలో `బంధం రేగడ్` అనే ఇండిపెండెంట్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన సాహిత్ మోత్కూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం జరిగింది. ఒక వైవిధ్యమైన కథాంశంతో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగే తమ చిత్రం, రేపు విడుదల తరువాత తప్పకుండా ప్రేక్షకుల మదిని తాకుతుందని చిత్ర బృదం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషా ఫిలింస్ పతాకాలపై సంతోశ్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక నేడు హైదరాబాద్ లో ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమాన్ని చిత్ర బృందం ఎంతో వేడుకగా నిర్వహించడం జరిగింది. ఈ టీజర్ విడుదల వేడుకకు చిత్రానికి పనిచేసిన హీరో నందు, హీరోయిన్ ప్రియాంక, దర్శకులు సాహిత్, నిర్మాత నిషాంక్ మరియు ఇతర సాంకేతికనిపుణులు హాజరయ్యారు. ప్రస్తుతం యూట్యూబ్ లో విడుదలైన ఈ చిత్ర టీజర్ కు వీక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు……!!


