వావ్.. బన్నీ కొత్త వ్యానిటీ వ్యాన్ చూశారా?

0
395

టాలీవుడ్ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ స్టైలిష్‌ వ్యానిటీ వ్యాన్‌ ని కొనుగోలు చేశారు. దాని ఫోటోలను ఈరోజు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బన్నీ తనకు కావాల్సిన వస్తువులను స్టైలిష్ గా ఉండేలా జాగ్రత్త పడతాడు. ఆయన ఇల్లు, కార్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సన్ గ్లాస్సెస్, బట్టలు ఇలా ఏవైనా అల్ట్రా స్టైలిష్ గా ఉంచుకోవడం బన్నీ అలవాటు.ఈ క్రమంలో ఆధునిక హంగులతో రూపొందించిన ఓ వ్యానిటీ వ్యాన్‌ను డిజైన్‌ చేయించుకున్నారు. దాదాపు రూ.6 కోట్లు పెట్టి వ్యానిటీ వ్యాన్‌ ను డిజైన్‌ చేయించారట. బన్నీ ఎంతో మనసుపడి రూపొందించుకున్న వ్యాన్‌కు ఫాల్కన్‌ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. బన్నీ ఇలా పోస్ట్ చేసారు..‘నా లైఫ్ లో నేను ఏదైనా కొనుక్కున్న ప్రతిసారీ అభిమానులు నాపై ఎల్లప్పుడూ ప్రేమను కురిపించారు అన్న విషయాన్ని మాత్రమే ఆలోచిస్తుంటాను. ఈరోజు నేను ఇవన్నీ కొనగలుగుతున్నానంటే వారికి నాపై ఉన్న ప్రేమలోని బలమే కారణం. మీకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను. ఇదే నా వ్యానిటీ వ్యాన్‌.. ‘ఫాల్కన్‌’’ అని పోస్ట్ చేశారు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయాలకు వస్తే..  బన్నీ వరుసగా మూడు సినిమాలను పట్టాలెక్కించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సారి జత కట్టాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ కాంబినేషన్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అలాగే అల్లు అర్జున్ ని ఆర్య సినిమా ద్వారా లవర్ బాయ్ గా తీర్చిబి దిద్దిన టాలీవుడ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ తో కూడా మూడో సారి జతకట్టుతున్నాడు. వీరిద్దరూ గతంలో ఆర్య, ఆర్య 2 చిత్రాలకు పనిచేసారు. అలాగే ఐ ఆమ్ ది చేంజ్ అనే సందేశాత్మక షార్ట్ ఫిలింను కూడా రూపొందించారు. ఇక బన్నీ ట్రాక్ లో పెట్టిన మూడో చిత్రం ఐకాన్.. శ్రీరామ్ వేణు ఈ చిత్ర దర్శకుడు.

https://industryhit.com/t/allu-arjuns-vanity-van-falcon-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here