వినూత్న ప్రచారంతో భయపెడుతున్న నిను వీడని నీడను నేనే

0
626

‘నిను వీడని నీడను నేనే’… సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం. ఈ సినిమా కోసం వినూత్నంగా పబ్లిసిటీ చేస్తున్నారు. ప్రశాంతంగా పాస్ పోసుకుందాం అని టాయిలెట్‌కి వెళ్లిన వాళ్లకు ‘కిందే చూడు.. వెనక్కి తిరిగి చూడొద్దు.. ఎవరో ఉన్నారు జాగ్రత్త..! నిను వీడని నీడను నీనే.. జూలై 12న వచ్చేస్తున్నా’ అంటూ మూవీ పోస్టర్లను పెట్టి టాయిలెట్‌కి వెళ్లే వాళ్లను భయపెడుతున్నాడు. వినూత్నంగా ప్రమోషన్ చేస్తే తప్ప ఫలితం ఉండదని భావించిన ఈ సినిమా టీం.. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుంది.

హారర్ థ్రిల్లర్‌ జోనర్ లో వస్తున్న ఈ సినిమా.. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్స్‌లోని టాయిలెట్స్‌లో ‘నిను వీడని నీడను నేనే’ బోర్డ్‌లను ఏర్పాటు చేసింది. టాయిలెట్స్ కోసం వెళ్లిన వాళ్ళు ఈ బోర్డ్‌లు చూసి అవాక్కవుతున్నారు. ప్రమోషన్ కోసం ఈ చిత్ర బృందం ఏర్పాటు చేసిన.. ‘కిందే చూడు.. వెనక్కి తిరిగి చూడొద్దు.. ఎవరో ఉన్నారు జాగ్రత్త..! నిను వీడని నీడను నీనే..’ అంటూ బోర్డ్‌తో పాటు.. ‘నాకు హారర్ ఫిల్మ్స్ అంటే భయం.. ఫాస్ట్‌గా జిప్ మూసెయ్.. నిను వీడని నీడను నీనే’, ‘అద్ధంలో చూసుకున్నప్పుడు జాగ్రత్త.. దెయ్యాలు ఉంటాయి’ లాంటి కొటేషన్స్ కనిపిస్తున్నాయ్ .

ఇక సినిమా వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను విస్తా డ్రీమ్ మర్చంట్స్‌తో కలిసి వి స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్, నిర్మాతలు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా.. సందీప్ కిషన్ తో అన్యా సింగ్ జోడి కట్టింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను సమర్పిస్తున్నారు. వెన్నెల కిషోర్, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, పోసాని క్రిష్ణమురళి, ప్రగతి, రాహుల్ రామక్రిష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here